»   » ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా శంక‌ర్ ప‌హిల్వాన్.. దివంగత శ్రీహరి సోదరుడు..

ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా శంక‌ర్ ప‌హిల్వాన్.. దివంగత శ్రీహరి సోదరుడు..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    కమెడియన్ తెలుగు ప్రేక్షకులను అలరించిన షకలక శంకర్ ఇటీవల హీరోగా మారాడు. ఆయన హీరోగా నటించిన శంభోశంకర చిత్రం మంచి విజయాన్ని అందుకొన్నది. హీరోగా ప్రస్తుతం డ్రైవర్ రాముడు అనే చిత్రంలో నటిస్తూనే మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    మైటీ మూవీస్ ప‌తాకంపై  ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ఏఏ ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో అబ్దుల్ అజీమ్ ,  మిర్జా అబిద్ హుస్సేన్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం శంక‌ర్ ప‌హిల్వాన్‌.  త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత‌లు మాట్లాడుతూ... కీర్తి శేషులు శ్రీహ‌రి సోద‌రుడు శ్రీధ‌ర్ హీరో ష‌క‌ల‌క శంక‌ర్ కు తండ్రి పాత్ర‌లో ప‌హిల్వాన్ గా న‌టిస్తున్నాడు. అలాగే విజ‌య‌వాడ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు క్రోసూరి మ‌ణి, కాదంబ‌రి కిర‌ణ్   ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఒక విలేజ్‌లో కుస్తీ పోటీల నేప‌థ్యంలో  సాగే ఈ  చిత్రాన్ని త్వ‌ర‌లో గ్రాండ్‌గా ప్రారంభించ‌నున్నాం అన్నారు.

    Shakalaka Shankar as Shankar Pahilwan

    ఈ చిత్రానికి ఆర్ట్ః బాబా;  కాస్ట్యూమ‌ర్ః సుబ్బ‌య్య‌; స్టిల్స్ః బాబు;  ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ః మ‌ల్లిక్‌;  సినిమాటోగ్ర‌ఫీః సుధాక‌ర్ నాయుడు;  ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌;  డాన్స్ః గ‌ణేష్‌;  మాట‌లుః చంద్ర‌శేఖ‌ర్. జి (పిల్ల జ‌మిందార్‌), మూలకథ:అబ్దుల్ అజీమ్, విక్ర‌మ్ రాజ్‌; నిర్మాత‌లుః అబ్దుల్ అజీమ్‌, మిర్జా అబిద్ హుస్సేన్‌;   క‌థ‌-స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వంఃఎ.ఎ.ధ‌నుష్. 

    English summary
    The popular comedian Shakalaka Shankar will soon be seen playing the lead role in Shankar Pahilwan. The movie will be helmed by AA Dhanush and will be jointly produced by Abdul Azeem and Mirza Abid Hussain. According to the latest update, the makers are planning to launch the project ‘Shankar Pahilwan’ very soon.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more