యాక్షన్ జోష్‌లో షకలక శంకర్.. చివరి షెడ్యూల్‌లో డ్రైవర్ రాముడు

కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న షకలక శంకర్ హీరోగా మారి శంభో శంకర చిత్రంతో భారీ సక్సెస్‌ను అందుకొన్నాడు. హీరోగా తన రెండో చిత్రం డ్రైవర్ రాముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన డ్రైవర్ రాముడు చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. అలాంటి ప్రతిష్టాత్మకమైన టైటిల్‌తో షకలక శంకర్ మరోసారి ప్రేక్షకులను తన నటనతో రంజింప చేసేందుకు వస్తున్నాడు.

డ్రైవర్ రాముడు చిత్ర చివరి షెడ్యూల్ శరవేగంగా జరుగుతున్నది. రంపచోడవరం, మారేడుమిల్లి, దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటున్నది. టాకీ పార్ట్‌తోపాటు క్లైమాక్స్‌లో భాగంగా వచ్చే కీలక సన్నివేశాలను షకలక శంకర్ ఇతర తారాగణంపై చిత్రీకరిస్తున్నారు. ఇదే షెడ్యూల్‌లో భారీ ఛేజ్, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Shakalaka Shankars Driver Ramudu in last schedule

ఈ షెడ్యూల్‌తో డ్రైవర్ రాముడు టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ చాలా సంతృప్తికరంగా ఉంది. షకలక శంకర్ కెరీర్‌లో మరో హిట్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది అని దర్శక, నిర్మాతలు వెల్లడించారు.

నటీనటులు: శంకర్, హర్షిత సింగ్, ప్రదీప్ రావత్, నజర్ , తాగుబోతు రమేశ్, ధన్ రాజ్, మహేష్ విట్టా తదితరులు

బ్యానర్- సినిమా పీపుల్స్
సమర్పణ - మాస్టర్ ప్రణవ్ తేజ్

మ్యూజిక్ - సునీల్ కశ్యప్

ఆర్ట్ - రఘు కుల్ కర్ణి

డిఓపి - అమర్ నాథ్

నిర్మాతలు - కే. వేణు గోపాల్ , ఎమ్ ఎల్ రాజు, టీ . కీరత్

దర్శకత్వం - రాజ్ సత్య
పీఆర్‌వో - వీఆర్ మధు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X