నేనే కేడీ నెం 1’ అంటూ ముద్దు సీన్లతో రెచ్చిపోయిన షకలక శంకర్

కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన షకలక శంకర్‌ త్వరలో నేనే కేడీ నెం-1' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్‌ఏ‌ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్లో ఎం.డి రౌఫ్ స‌మ‌ర్ప‌ణ‌లో జాని స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముస్కాన్ హీరోయిన్. తాజాగా విడుదలైన ట్రైలర్లో హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సీన్లు ఉండటం గమనార్హం.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 26న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం ట్రైల‌ర్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సి కళ్యాణ్ మాట్లాడుతూ... ష‌క‌ల‌క శంక‌ర్‌కి మంచి గుర్తింపు ఉంది కాబ‌ట్టి ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం ఉందన్నారు.

Shakalaka Shankars Nene Kedi No.1 Theatrical Trailer released

ద‌ర్శ‌క నిర్మాత జాని మాట్లాడుతూ...'యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా నేనే కేడి నెం-1 తెకెక్కించాం. పిల్ల‌లు చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌ల‌ుగా మారడానికి త‌ల్లిదండ్రులు కూడా కారణమే. వారిని ప‌ట్టించుకోకుండా, బాధ్య‌త‌లు తెల‌ప‌కుండా పూర్తి స్వేచ్ఛ‌నిస్తూ గాలికి వ‌దిలేయడం వల్ల ఎలాంటి అనర్ధాలు కలుగుతాయి అనేది మా సినిమాలో చూపించామని తెలిపారు.

ష‌క‌ల‌క శంక‌ర్ ఈ చిత్రంలో మూడు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ు ఇందులో ఉంటాయి. హీరోయిన్ ముస్కాన్ అందం, అభిన‌యంతో పాటు నికిషా ప‌టేల్, పృథ్వీ పాత్ర‌లు సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌‌గా ఉంటాయన్నారు.

ముకుల్ దేవ్‌, నికిషా ప‌టేల్ , క‌రాటే క‌ళ్యాణి, దేవ‌న్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః అజ‌య్ ప‌ట్నాయ‌క్‌; కెమెరాః శ్రావ‌ణ్ కుమార్; ఎడిట‌ర్ః సాములేటి శ్రీనివాస్ ; స్టోరీ - స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం- నిర్మాతః జాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X