చిరంజీవి మూవీ టైటిల్‌తో శకలక శంకర్ నెక్ట్స్ మూవీ!

'శంభో శంకర' సినిమాతో హీరోగా టర్న్ అయిన జబర్దస్త్ కమెడియన్ శకలక శంకర్ త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ భవాని ఫిలింస్‌ పతాకంపై జి.వరలక్ష్మి సమర్పణలో షకలక శంకర్‌ హీరోగా హనుమాన్‌ కృష్ణ దర్శకత్వంలో శ్రీనివాసరావు గొలుసు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రానికి 'ఖైదీ' అనే టైటిల్ ఖరారు చేశారు.

దసరాకు సినిమా లాంచ్ చేసి... షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పాటల రికార్డింగ్‌ కూడా పూర్తయింది. కామెడీ,, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.

ఈ చిత్రం గురించి నిర్మాత శ్రీనివాసరావు గొలుసు మాట్లాడుతూ...''చిరంజీవి గారి కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం 'ఖైదీ'. అలాంటి గొప్ప సినిమా టైటిల్‌‌తో ఆ సినిమాకు ఏమాత్రం చెడ్డ పేరు తేకుండా షకలక శంకర్‌ హీరోగా 'ఖైదీ' చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు.

Shakalaka Shankars next film title Khaidi

కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మా దర్శకుడు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిస్తున్నారు. దసరా సందర్భంగా సినిమా షూటింగ్‌ గ్రాండ్‌గా ప్రారంభించనున్నాం'' అన్నారు.

శకలక శంకర్ గత చిత్రం 'శంభో శంకర' బాక్సాఫీసు వద్ద యావరేజ్ ఫలితం సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమాను మించి పోయే విధంగా 'ఖైదీ' వినోదాత్మక అంశాలతో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X