ఆ సీన్ చూసి థియేటర్లో వాంతులు చేసుకుంటారు: షకలక శంకర్
హీరోయిన్ నందితశ్వేతా ప్రధాన పాత్రలో బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి నిర్మించిన చిత్రం 'అక్షర'. విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే అంశంతో ఈ సినిమా సాగుతుంది. తాజాగా హైదరాబాద్‌లో టీజర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది.
ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న షకలక శంకర్ మాట్లాడుతూ... ''చిన్ని కృష్ణతో పరిచయం దర్శుకుడు వినాయక్‌గారి దగ్గర నుంచి మొదలైంది. అప్పుడు ఆయన వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. నేను వినాయక్ గారి ఇంట్లో అసిస్టెంటుగా పని చేస్తూ దోసెలు వేసేవాడిని, అలా నేను చిన్నిగారికి పరిచయమై మా మధ్య స్నేహం ఏర్పడింది. నా జీవితంలో అక్షరానికి నాకు సంబంధం లేదు. ఎప్పుడూ చదువకోలేదు. చదువుకుంటే మంచి ఉద్యోగం చేసుకునేవాడిని.'' అన్నారు.

'అక్షర' సినిమా బావుంటుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో డైరెక్టర్ మాతో షర్టు లేకుండా ఓ సీన్ చేయించాడు, ఆ దెబ్బకు రాత్రంతా దోమలు కరిచాయి. కంప్లీట్ అయ్యాక ఆ సీన్ చూసుకుంటే ఔట్ పుట్ అద్భుతంగా ఉంది. కడుపు నిండా తిని వచ్చినవారు థియేటర్లో ఆ సీన్ చూసి నవ్వీ నవ్వీ వాంతులు చేసుకుంటారు. అంత గొప్పగా ఆ సీన్ ఉంటుందని షకలక శంకర్ తెలిపారు.
నందిత శ్వేత టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ్, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో నిపించబోతోన్న ఈ చిత్రానికి కెమెరామెన్: నగేష్ బెనెల్, మ్యూజిక్ డైరెక్టర్ : సురేష్ బొబ్బిలి, ఎడిటర్: జి.సత్య, ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి, కాస్టూమ్ డిజైనర్ : గౌరీనాయుడు, లైన్ ప్రొడ్యూసర్స్: గంగాధర్, రాజు ఓలేటి,
కో-ప్రొడ్యూసర్: కె.శ్రీనివాస రెడ్డి. సుమంత్ కొప్పురావూరి, నిర్మాణ సంస్థ: సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాతలు: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ, రచన, దర్శకత్వం: బి. చిన్నికృష్ణ.


Click it and Unblock the Notifications











