ఒక తండ్రికి పుట్టినోళ్లేనా.. అప్పులతో చస్తుంటే ఇలాంటి మోసం చేస్తారా: షకీలా ఆగ్రహం

బి గ్రేడ్ యాక్టర్ గా ఒకప్పుడు తన సినిమాలతో సంచలనం సృష్టించిన షకీలా ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఇక కష్టకాలంలో ఆమెను మరొక కష్టం మరింత బాధకు గురి చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా షకీలా తనకు జరిగిన మోసం గురించి మాట్లాడుతూ.. ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీరు మానుషులేనా అంటూ తన ఆవేదనను కూడా వ్యక్తం చేసింది.

Recommended Video

Shakeela To Release Her Film In OTT Platform
 ఆర్థికంగా నిలదొక్కుకోవాలని

ఆర్థికంగా నిలదొక్కుకోవాలని

ఒకప్పుడు లక్షల ఆదాయాన్ని చూసిన షకీలా ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటూ సాధారణ జీవితాన్ని గడుపుతోంది. ఇక ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సినిమాలు చేస్తున్న సమయంలో లాక్ డౌన్ మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆమెకు సరైన అవకాశాలు కూడా రావడం లేదు. అయితే చిన్న బడ్జెట్ లో అడల్ట్ సినిమాను నిర్మించిన ఆమె లాభాలతో సెటిల్ అవ్వాలని అనుకున్నారు.

 అప్పుల బాధ తట్టుకోలేక

అప్పుల బాధ తట్టుకోలేక

అడల్ట్ కామెడీ సినిమాగా రూపొందిన లేడీస్ నాటి అలౌడ్ అనే సినిమాను నిర్మించిన షకీలా రిలీజ్ చేయాలని గత రెండేళ్లుగా సెన్సార్ కోసం ప్రయత్నించి విఫలం అయ్యింది. ఇక అప్పుల బాధ తట్టుకోలేక ఆన్లైన్ లో వెబ్ సైట్ క్రియేట్ చేసి రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆమె లాక్ డౌన్ కి ముందు సినిమా కోసం ఎంతగానో ప్రమోషన్స్ చేశారు.

సినిమాను పైరసీ చేయడంతో

సినిమాను పైరసీ చేయడంతో

ఆ సినిమా కోసం షకీలా చాలా అప్పులు చేసినట్లు చెప్పింది. ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా డబ్బులు లేవని అప్పుల వాళ్ళు ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలిపింది. ఇక కరోనా వైరస్ కారణంగా థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లోనే సినిమాను నిర్ణయం తీసుకుంది. అయితే సినిమాను పైరసీ చేయడంతో ఆమె తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

రెండు రోజుల్లోనే నాలుగు వేల మంది

రెండు రోజుల్లోనే నాలుగు వేల మంది

షకీలా మాట్లాడుతూ.. లేడీస్ నాగ్ అలౌడ్ డాట్ కమ్ వెబ్ సైట్ లో ఈ నెల 20న మా సినిమా రిలీజ్ అయ్యింది. రెండు రోజుల్లోనే నాలుగు వేల మంది సినిమాను చూశారు. ఫిల్మ్ బాగుంది అని క్రిటిక్స్ చెబుతున్నారు. లేడీస్ కూడా ఈ సినిమాను చూసి చాలా బావుందని ఫోన్ చేస్తున్నారు.

మీకు సిగ్గు లేదా.. అన్నమే తింటున్నారా?

మీకు సిగ్గు లేదా.. అన్నమే తింటున్నారా?

ఇలాంటి ఆనంద సమయంలో ఒక విషయం బాధను కలిగిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను కూడా పైరసీ చేశారట. నిజంగా మీకు సిగ్గు లేదా.. అన్నమే తింటున్నారా?.. ఎన్నో ప్రమోషన్స్ , ఇంటర్వ్యూలలో చెప్పాను. వడ్డీలకు అప్పు చేసి సినిమా తీశాము అని. అయినా కూడా పైరసీ ఎలా చేస్తారు. ఓ వైపు అప్పుల బాధ తట్టుకోలేక సతమతమవుతుంటే ఇలా 50రూపాయల సినిమాను పైరసీ చేయడం కరెక్ట్ కాదు.

మంచి అమ్మ నాన్నలకు పుట్టి ఉండరు

మంచి అమ్మ నాన్నలకు పుట్టి ఉండరు

అసలు మీరు మనుషులేనా? నిజంగా పైరసీ చేసిన వాళ్ళు ఒక మంచి అమ్మ నాన్నలకు పుట్టి ఉండరు. అయినా కూడా నా ఆడియెన్స్ మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళు వెబ్ సైట్ లోకి వెళ్లి సినిమా చూస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు నా మనసుకు చాలా కష్టంగా ఉంది. దయచేసి సినిమా చూసి సపోర్ట్ చేయాలని షకీలా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X