For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్ గా షకీలా ట్రాన్స్ జెండర్ కూతురు.. ఘాటు సినిమాల టెన్షన్ తో సొంత ఓటీటీ లాంచ్!

  |

  బీ గ్రేడ్ హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసి స్టార్లకు పోటీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది షకీలా. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది మాత్రమే కాక దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించింది. ఒక రకంగా ఆమె స్టార్ హీరోలతో పోటీ పడి మరీ తన సినిమాలు విడుదల చేస్తూ ప్రేక్షకాదరణను పొందింది. ఒకరకంగా ఇండియాలో మొట్టమొదటి శృంగార తారగా ఒక వెలుగు వెలిగిన ఈమె ఇప్పుడు శృంగార సినిమాలు చేయడానికి సిద్ధం అయింది. ఆ వివరాల్లోకి వెళితే

  సూపర్ స్టార్ క్రేజ్

  సూపర్ స్టార్ క్రేజ్

  దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండియన్ సినిమా స్క్రీన్ మీద సత్తా చాటింది షకీలా. బీ గ్రేడ్ హీరోయిన్‌గానే పేరు సంపాదించుకున్నప్పటికీ.. ఏ హీరోయిన్‌కూ రాని ఫాలోయింగ్‌ సొంతం చేసుకుంది. కేవలం రొమాంటిక్ సినిమాల్లోనే నటించిన ఆమె.. భారతదేశంలోని ఏకైక శృంగార తారగా అప్పట్లో ఆమె గుర్తింపు పొందింది. అందుకే ఆదరణను అందుకుంది. షకీలా నటించిన సినిమాలకు విపరీతమైన ఆదరణ లభించింది. ఆమె సినిమా విడుదల అవుతుంది అని స్టార్ హీరోలు వెనక్కి తగ్గే వాళ్ళు.

  దత్తత తీసుకుని

  దత్తత తీసుకుని


  సీజన్లతో సంబంధం లేకుండా ఆమె ప్రతి చిత్రానికి హౌస్‌ఫుల్ బోర్డులు పడిపోయేవి. ఆమె సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తుండేది. పెద్ద స్టార్లే వెనక్కి తగ్గుతుంటే చిన్న సినిమాలు కూడా సైలెంట్ గా సర్డుకునేవి. ఇక కొన్నల్లగా ఆమె సినిమాల్లో నటించడం తగ్గించింది. ఆమె పెళ్లి చేసుకోలే కానీ మిల్లా అనే ట్రాన్స్‌జెండర్‌ను దత్తత తీసుకొన్నారు. అప్పటి నుంచి తన సొంత కూతురిలా చూసుకుంటున్నారు. తన కూతురు మిల్లానే ప్రపంచంగా భావించి ఆమెను అల్లారుముద్దుగా పెంచింది.

  క్యాస్టూమ్ డిజైనర్‌ టు హీరోయిన్

  క్యాస్టూమ్ డిజైనర్‌ టు హీరోయిన్

  ప్రస్తుతం మిల్లా సినీ పరిశ్రమలో క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నా ఆమెకు హీరోయిన్ కావాలనే కోరిక ఉండడంతో ఆ మేరకు ఏకంగా రెండు సినిమాలు ఒప్పుకుంది. తాను సొంతంగా ఓటీటీ ప్లాట్‌ఫాం ఒకటి లాంచ్ చేస్తున్నానని దాని ద్వారా తాను నటించే సినిమాలే కాక ఇతర సినిమాలను రిలీజ్‌ చేస్తానని పేర్కొంది. ఇక తన కుమార్తెను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ రెండు ప్రాజెక్టులను అనౌన్స్‌ చేసిన ఆమె ఆ సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్‌ చేసింది.

  ఎందుకొచ్చిన టెన్షన్ అని

  ఎందుకొచ్చిన టెన్షన్ అని

  ఇక డైరెక్టర్‌ రమేష్ కావలి చెప్పిన స్క్రిప్ట్‌ తనకు బాగా నచ్చాయని, గోవాలో అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్‌ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా ఈ రెండు సినిమాల్లో తన కూతురితో కలిసి నటించానని షకీలా పేర్కొన్నారు. ఇక గతంలో శీలవతి అనే సినిమా రిలీజ్‌ విషయంలో సెన్సార్‌ వద్ద చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అందుకే సొంతంగా తమ ఓటీటీ సంస్థలో సినిమాలు రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు షకీలా వెల్లడించారు.

  ఈ మధ్యనే

  ఈ మధ్యనే

  ఇక ఈ మధ్యనే షకీలా తమిళ టెలివిజన్ ఛానెల్‌లో తన కూతురు మిల్లా గురించి కొన్ని విషయాలు పంచుకుంది. మిల్లా నాకు సర్వస్వం అని పేర్కొన్న ఆమె నా జీవితంలో ఎదురైన కష్ట సమయాల్లో నాకు మానసికంగా స్థైర్యాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. నాకు కొండంత అండగా నిలిచిందని,. ఏ సమయంలోనైనా నాకు ఆమె అండగా నిలుస్తుంది అని కూడా షకీలా చెప్పుకొచ్చింది. ఇక తమిళంలో షకీలా కుక్కు విత్ కోమలి షో కూడా చేస్తోంది.

  English summary
  Shakeela adopted a daughter named Milla. She is transgender when she was young and has since been brought her up as her own daughter. Shakeela launches her Daughter Milla as heroine as well as a own ott.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X