ఏకంగా ఏడుగురు.. ఒకరి తర్వాత మరొకరు.. ఇక పెళ్ళెక్కడ చేసుకుంటా? షకీలా సంచలన వ్యాఖ్యలు
శృంగార తారగా షకీలా ఓ వెలుగు వెలిగింది. ఒకప్పుడు రసిక ప్రియుల ఆరాధ్యదైవంగా వెండితెరపై హంగామా చేసింది షకీలా. కొన్ని థియేటర్స్ ఆమె సినిమాల కోసమే ప్రత్యేకంగా కేటాయించబడేవి అంటే అర్థం చేసుకోవచ్చు ఈ సెక్సీ తార క్రెడిట్ ఎలా ఉండేదో!. అలాంటిది ఒక్కసారిగా షకీలా ప్రస్థానం క్లోజ్ అయింది. పెరుగుతున్న ఆధునికత, ఇంటర్నెట్ బాగా విస్తరించడం దీనికి ప్రధాన కారణం. అయితే ఆమె నిజ జీవితంలో జరిగిన ఆసక్తికర పరిణామాలు ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్, పెళ్లి విషయమై సంచలన వ్యాఖ్యలు చేసింది షకీలా.

వెండితెరపై షకీలా.. రీ ఎంట్రీ
గతంలో సెక్సీ స్టార్ గా మంచి గుర్తింపు పొందిన షకీలా.. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఇటీవల జరిగిన కొన్ని ఇంటర్వూస్‌లో తన జీవితంలో పడిన కష్టాలు, సొంత అక్క చేతిలో మోసపోయిన తీరు చెప్పి ఆమె ఫాన్స్ కళ్ళలో కన్నీరు నింపింది. ఇక తాజాగా అవన్నీ మరిచి మరోసారి 'కొబ్బరి మట్ట' సినిమా ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది షకీలా. ఈ చిత్రంలో కత్తి మహేష్ తో జోడీగా, సంపూ తల్లిగా నటించడం ఆసక్తికరంగా మారింది.

కొబ్బరిమట్ట హవా
సంపూర్ణేష్ బాబు హీరోగా ఆయన కెరీర్ లో మూడో సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది కొబ్బరిమట్ట మూవీ. బాక్సాఫీస్ వద్ద హంగామా కొనసాగిస్తూ సంపూ ఖాతాలో మరో హిట్ చేర్చింది కొబ్బరిమట్ట. ఈ సినిమా విజయంలో భాగం పంచుకున్న షకీలా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయమై స్పందించింది.

43 ఏళ్ళైనా పెళ్లికాని షకీలా
ప్రస్తుతం షకీలా వయసు 43 సంవత్సరాలు. కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే తాను ఇలా ఉండటానికి దారితీసిన పరిస్థితులు ఆమెనే స్వయంగా వెల్లడించింది. ఇప్పటికే తనకు 43 సంవత్సరాలు వచ్చేశాయని ఇకపై పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని షకీలా చెప్పింది. అయితే గతంలో తన జీవితంలో ఏడుగురితో రిలేషన్‌లో ఉన్నానని, వాళ్లంతా ఒక్కొక్కరుగా దూరం కావడంతో తాను పెళ్లి చేసుకోలేక పోయానని వాపోయింది.

అదే జరిగితే ఈపాటికి పెళ్లై బిడ్డలు కూడా
తాను మొదటి వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నప్పుడే ఇంట్లోవాళ్ళు అడ్డు చెప్పి ఉంటే ఈపాటికి పెళ్లై బిడ్డలు ఉండేవారని.. అలా జరగకపోవడం వల్లనే ఈ రోజు ఇలా ఉన్నానని చెప్పుకొచ్చింది షకీలా. కాకపోతే ఏ తప్పూ చేయలేదని పేర్కొంది. ఏది చేసినా పబ్లిక్‌కి తెలిసేలా చేశానే తప్ప సీక్రెట్ గా చేయలేదని ఆమె తెలిపింది.

ఒకరి తర్వాత మరొకరు.. కారణం
అయితే ఏ ఒక్కరితోనూ రాంగ్ ఎఫైర్ పెట్టుకోలేదని చెప్పిన షకీలా.. ఒకరితో ఎఫైర్ కట్ అయిన తర్వాతనే మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నానని తెలిపింది. ఎక్కడా తన మీద తప్పులేదని, అయితే ఆ ఏడుగురు ఒక్కొక్కరుగా తన నుండి విడిపోవడానికి తానే పరోక్షంగా కారణంయ్యానేమో అని చెప్పుకొచ్చింది షకీలా.


Click it and Unblock the Notifications











