twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘షకీలా రాసిన కుటుంబ కథాచిత్రం’.. ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

    |

    ష‌కీలా ప్రధాన పాత్రధారిణిగా విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాత‌గా సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించిన చిత్రం 'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం'. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఆవిష్కరణ ఆదివారం ఫిల్మ్ చాంబర్లో జరిగింది.

    ఈ కార్య‌క్ర‌మంలో న‌టి షకీలా మాట్లాడుతూ .. 'నేను నిర్మించిన 'లేడీస్ నాట్ అలౌడ్' సినిమా పది నెలలుగా సెన్సార్ అవడం లేదు. ఎంతో వల్గారిటీతో వచ్చిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ మా సినిమాకే సెన్సార్ వాళ్లు ఎందుకు అభ్యంతరాలు చెపుతున్నారో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ట్రిబ్యునల్ లో ఉంది. షకీలా అంటే వల్గారిటీ సినిమాలేనా.. ఫ్యామిలీ సినిమాలు చేయదా అనే విమర్శలున్నాయి. అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించడం కోసం కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా చేస్తున్నాను. షకీలా నిర్మాత అంటేనే సెన్సార్ ఇవ్వడం లేదు.. ఇది నేను రాసిన కథ అంటే ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో. కానీ ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్' అని చెప్పుకొచ్చింది.

     Shakheela Rasina Kutumba Katha Chitram First Glimpse Released

    దర్శకుడు సతీష్ వి.ఎన్ మాట్లాడుతూ.. 'కొత్తగా ప్రయత్నించాం. అన్ని వర్గాలకు నచ్చే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఏప్రిల్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నామ'ని అన్నాడు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. 'గత చిత్రం 'లేడీస్ నాట్ అలౌడ్'కి సహనిర్మాతగా పనిచేశాను. ఆ సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సాయిరాం దాసరి కొత్తగా ప్రయత్నించాడు. కచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నామ'ని అన్నారు.

    English summary
    Shakheela Rasina Kutumba Katha Chitram First Glimpse Released. This Movie Is Directed By Satish VN.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X