నేను బతికా ఉన్నా.. మరణ వార్తలపై లెజెండరీ నటుడి ఆవేదన

సోషల్ మీడియా రాకతో వార్తలు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. అయితే వీటితో ఏది నిజమైన వార్తో, ఏది అబద్దమో తెలియడం లేదు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో అసత్య వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బతికున్న నటీనటులు చనిపోయినట్లుగా ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. దాంతో వారి అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. బతికున్న నటులు స్వయంగా మీడియా ముందుకు వచ్చి మేము బతికే ఉన్నాం.. చనిపోలేదని వివరణ ఇవ్వాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు, హీరోయిన్ శ్రద్ధా కపూర్ తండ్రి శక్తికపూర్ చనిపోయినట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ షాకైంది.

శక్తి కపూర్ శుక్రవారం మరణించారంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో వార్తలు రావడంతో కలకలం రేగింది. దీంతో అభిమానులు, సినీ వర్గాలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇది నిజమని నమ్మని కొందరు సామాజిక మాధ్యమాల్లో శక్తికపూర్‌కు నివాళులర్చించారు కూడా. హీరోయిన్ శృద్ధాకపూర్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు సినీ ప్రముఖుల నుంచి ఫోన్లు, సంతాప సందేశాలు రావడంతో వారు తీవ్ర అసహనానికి గురయ్యారట.

Shakti Kapoor Reacts to Death Rumours Warns of Cyber Police Complaint

అయితే ఈ ఫేక్ న్యూస్‌పై స్వయంగా శక్తి కపూర్ స్పందించారు. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఆయన.. తాను బతికే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. నేను చనిపోయానంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం. నేను ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. ఈ పుకార్లను నమ్మొద్దు.. నా గురించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేసిన వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని శక్తికపూర్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శక్తికపూర్ బతికే ఉన్నారని తెలిసి అభిమానులు, సినీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

శక్తి కపూర్ ప్రస్థానం:
శక్తి కపూర్ అసలు పేరు సునీల్ కపూర్. 1952 సెప్టెంబర్ 3న ఢిల్లీలో జన్మించారు. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటనలో ఓనమాలు దిద్దిన ఆయన.. అవకాశాల కోసం ఎంతో శ్రమించారు. 1977లో ఖేల్ ఖిలారి సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ దశలో ఆస్రానీ, కదేర్ ఖాన్‌లతో పరిచయం శక్తి కపూర్ జీవితాన్ని మలుపు తిప్పింది. 1980 నుంచి 1990 మధ్యకాలంలో ఈ ముగ్గురు కలిసి దాదాపు 100కు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.

ఖుర్బనీ, రాకీ, హిమ్మత్ వాలా, హీరో, రాజా బాబు, చాల్‌బాజ్, బోల్ రాధా బలో, హంగామా, చుప్ చుప్ కే తదితర చిత్రాలు శక్తికపూర్‌కు ఎంతో గుర్తింపు తీసుకొచ్చాయి. తెలుగులో కలియుగ పాండవులు, యుద్ధభూమి, సాహసం సినిమాలలో ఆయన నటించారు. 50 ఏళ్లకు పైగా కెరీర్‌లో హిందీ, తెలుగు, బెంగాలీ, బంగ్లాదేశీ, కన్నడ, ఒడియా, భోజ్‌పురి, మరాఠీ, నేపాలీ, మలయాళం, పంజాబీ భాషలలో శక్తికపూర్ నటించారు. అలాగే 2011లో హిందీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. దిగ్గజ నటి పద్మినీ కొల్హాపురి సోదరి శివంగి కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు శక్తికపూర్. ఈ దంపతులకు సిద్దార్ధ్ కపూర్, శ్రద్ధా కపూర్‌లు సంతానం. వీరిద్దరూ సినీరంగంలోనే స్థిరపడి.. శక్తి కపూర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

Read more about: shakti kapoor shraddha kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X