నా మగతనం అలా చూపిస్తా... 67 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైన టాప్ హీరో

భారతీయ చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ చాలామందే ఉన్నారు సల్మాన్ ఖాన్, ప్రభాస్, అనుష్క శెట్టి, త్రిష, అంజలి, శృతిహాసన్, అక్షయ్ ఖన్నా తదితరులు 50 ఏళ్లు, 60 ఏళ్లు దాటుతున్నా పెళ్లి మాట ఎత్తడం లేదు. మరికొందరైతే లేటు వయసులోనూ రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ నటుడు 67 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే నన్ను వదిలేశాడు!
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే నన్ను వదిలేశాడు!

ముఖేష్ ఖన్నా అంటే ఎవరికీ గుర్తుపట్టకపోవచ్చు. కానీ శక్తిమాన్ హీరో అంటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు. 90వ దశకంలో భారతీయ చిన్నారులను, బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ వెబ్ సిరీస్. అందులో శక్తిమాన్‌గా ముఖేష్ ఖన్నా విన్యాసాలు, యాక్టింగ్‌కు పిల్లలు ఫిదా అయిపోయారు. 1997 నుంచి 2005 వరకు దూరదర్శన్ వేదికగా శక్తిమాన్ సీరియల్ ప్రసారమైంది. ఒక తరం పిల్లలకు శక్తిమాన్ సీరియల్ ఎంతో సెంటిమెంట్.. ఈ సీరియల్‌తో దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు ముఖేష్.

Shaktimaan Fame Mukesh Khanna Ready for Marriage at 67 His Comments Go Viral

దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు ముఖేష్ ఖన్నా. ముంబైలో చదువుకున్న ఆయన.. అనంతరం పూణేలోని ప్రఖ్యాత ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. 1981లో రూహి అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ముఖేష్ ఖన్నా.. సౌగంధ్, సౌధాగర్, తెహల్కా, బేతాజ్ బాద్ షా, అమానత్, జవాబ్, పాండవ్ తదితర సినిమాలలో నటించారు. ధన 51, పురుషోత్తముడు చిత్రాలతో తెలుగువారిని కూడా పలకరించారు ముఖేష్ ఖన్నా.

Recommended For You
'ఆ నాలుగేళ్లు నరకం చూశా... అలా సీతాలక్ష్మీ నుంచి యాస్మిన్‌గా మారా’
'ఆ నాలుగేళ్లు నరకం చూశా... అలా సీతాలక్ష్మీ నుంచి యాస్మిన్‌గా మారా’

అయితే బీఆర్ చోప్రా దర్శకత్వంలో మహాభారత్‌ ధారావాహికలో భీష్ముడిగా నటించి ఆకట్టుకున్నారు ముఖేష్. ఆ తర్వాత విశ్వామిత్ర, ది గ్రేట్ మరాఠా, మహాభారత్ కథ సీరియల్స్‌లో నటించారు. ఈ దశలో 1997లో ప్రారంభమైన శక్తిమాన్ ధారావాహిక ఆయనకు తిరుగులేని స్టార్‌డమ్‌ను, గుర్తింపును తీసుకొచ్చింది. శక్తిమాన్ అంటే ముఖేష్ ఖన్నా.. ముఖేష్ ఖన్నా అంటే శక్తిమాన్ అన్నంతగా ఆయన తనదైన ముద్రవేశారు. ఈ వయసులోనూ సినిమాలు చేస్తూ కుర్రాళ్లను మించి దూసుకెళ్తున్నారు.

You May Also Like
ఆ 15 రోజులు నరకం చూశా.. బతుకుతానని అనుకోలేదు
ఆ 15 రోజులు నరకం చూశా.. బతుకుతానని అనుకోలేదు

67 ఏళ్ల ముఖేష్ ఖన్నా అవివాహితుడు... తన జీవితాన్ని సినిమాకు, కళకు అంకితం చేసిన ఆయన తాజాగా పెళ్లికి రెడీ అయినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. ఇటీవల ది ఫిల్మీ చర్చా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ముఖేష్ ఖన్నా.. తన పెళ్లి, రిలేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాహ వ్యవస్థను నేను ఎంతగానో విశ్వసిస్తా. వివాహం చేసుకోకపోతే దీనిపై నమ్మకం లేదనుకోవడం పొరపాటు. సరైన వ్యక్తిని కలిసినప్పుడు నేను పెళ్లికి సిద్ధమే. భార్య అనే వ్యక్తి జీవితంలోకి యాదృచ్ఛికంగా రాదు. నేను పెళ్లాడాలని విధి రాసి ఉంటే.. నా భార్య ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందని ముఖేష్ ఖన్నా పేర్కొన్నారు.

9 రోజుల్లో 4000 కోట్ల కలెక్షన్లు.. బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన మైఖేల్
9 రోజుల్లో 4000 కోట్ల కలెక్షన్లు.. బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన మైఖేల్

పెళ్లి అనేది కర్మ బంధం.. భారతీయ పురాణాల ప్రకారం భార్య అనేది పూర్వ జన్మల ప్రారబ్ధం. వివాహం అంటే రెండు ఆత్మల కలయిక. మగతనాన్ని నిరూపించుకోవడానికి పలువురితో సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మగతనాన్ని చూపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒకరిని ప్రేమించి.. ఆ వెంటనే మరో వ్యక్తి వైపు వెళ్లడమంటే కృతజ్ఞత లేని పని అని ముఖేష్ ఖన్నా తేల్చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అవుతున్నాయి. దాంతో ముఖేష్ ఖన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more about: shaktimaan mukesh khanna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X