టెన్షన్‌ పడుతున్న షాలినీ పాండే.. సైలెన్స్ అంటూ రంగంలోకి

'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది షాలినీ పాండే. రెచ్చిపోయి ముద్దు సీన్లు చేసినప్పటికీ ఈ సినిమా ఆమెకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పుకోవాలి. సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఈమెకు మాత్రం అవకాశాల వరద పారలేదు. ఒకటి అరా సినిమాలు చేసినప్పటికీ అవి కూడా పెద్దగా ఫేం తీసుకురాలేదు. దీంతో కొంతకాలం పాటు బ్రేక్ తీసుకున్న ఈమె ప్రస్తుతం అనుష్క లీడ్ రోల్‌లో రాబోతున్న 'నిశ్శబ్దం' సినిమాలో నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి షాలినీ పాండేకు సంబంధించిన లుక్ రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు. 'నిశ్శబ్దం' సినిమాలో సోనాలి అనే పాత్రలో షాలినీ పాండే నటిస్తోందని ఈ లుక్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు టెన్షన్‌ పడుతున్న షాలినీ పాండే లుక్‌ని ప్రేక్షకుల ముందుంచారు. ఈ లుక్ చూస్తుంటే ఈ సినిమాలో షాలినీ క్యారెక్టర్‌కి బాగా ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది.

 Shalini Pandey Look From Anushka Shettys Nishabdam

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నిశ్శబ్దం' సినిమాలో అనుష్క శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తోంది. కోనవెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కోన ఫిలింఫ్యాక్టరీ- పీపుల్స్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

అమెరికా సియాటిల్ నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో అంజలి, మాధవన్ లీడ్ రోల్స్ పోషించారు. థ్రిల్లర్ హారర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో అనుష్క చిత్రకారిణిగా నటిస్తోంది. మాధవన్ మ్యుజీషియన్‌గా నటిస్తున్నాడు. అంజలి సియాటిల్ పోలీస్ వింగ్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X