హాట్ హాట్‌గా అర్జున్ రెడ్డి పిల్ల.. కన్నుగీటి హంగామా!
అర్జున్ రెడ్డి చిత్రంలో ఘాటైన లిప్‌లాక్స్‌తో షాలిని పాండే సృష్టించిన హంగామా యువతలో గిలిగింతలు పెట్టింది. బోల్డ్‌గా నటించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. చాలా రోజుల తర్వాత తాజాగా 118 చిత్రంలో మళ్లీ గ్లామర్‌ను పండించింది. ఈ చిత్రం విజయపథంలో దూసుకెళ్తున్న సమయంలో చిత్రయూనిట్ శనివారం (మార్చి 16) రోజున హైదరాబాద్ ఆవాసా హోటల్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.

118 మూవీ సక్సెస్ మీట్‌కు హాజరైన షాలిని పాండే ఇలా హాట్ హాట్‌గా ఫొటోలకు ఫోజిచ్చింది. ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని ఫొటోల్లో చిలిపిగా, అమాయకత్వంగా కనిపించి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

ప్రస్తుతం తమిళ సినిమాల్లో షాలిని పాండే బిజిగా మారింది. తెలుగులో ఘన విజయం సాధించిన 100% లవ్ చిత్రంలో నటిస్తున్నది. తెలుగులో తమన్నా పోషించిన పాత్రలో షాలిని పాండే కనిపించనున్నారు.



Click it and Unblock the Notifications











