13 ఏళ్ల తర్వాత శంబాలతో హిట్.. గుడ్‌న్యూస్ చెప్పిన ఆది సాయికుమార్ దంపతులు

డైలాగ్ కింగ్ సాయికుమార్ నట వారసుడిగా వెండితెరపై అడుగుపెట్టారు ఆది సాయికుమార్. ప్రేమకావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు.. తొలి సినిమాతోనే రికార్డ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత లవ్‌లీ, సుకుమారుడు సినిమాలతో వరుస హిట్స్‌ని సొంతం చేసుకుని టాలీవుడ్‌లో కొత్త లవర్‌బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. కానీ ఈ సక్సెస్‌ను కంటిన్యూ చేయడంలో ఈ కుర్రాడు తడబడ్డాడు.

వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నప్పటికీ ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూనే వచ్చింది. లవ్‌స్టోరీలు, థ్రిల్లర్స్, మాస్ యాక్షన్ సినిమాలు ఇలా అన్ని జోనర్స్‌ ట్రై చేసినా ఆదికి కాలం కలిసి రాలేదు. సుకుమారుడు తర్వాత చేసిన ప్యార్ మే పడిపోయా, గాలిపటం, రఫ్, గరం, చుట్టాలబ్బాయ్, శమంతకమణి, నెక్ట్స్ నువ్వే, బుర్రకథ, జోడీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, శశి, బ్లాక్, క్రేజీ ఫెలో, టాప్ గేర్, సీఎస్ఐ శంతన్, షణ్ముక తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.

Shambhala fame Aadi Saikumar and Aruna Couple Blessed Baby Boy

ఈ క్రమంలో ఆది సాయకుమార్ సాహసం చేశాడు అదే శంబాల. మిస్టరీ, హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ బయటకు వచ్చినప్పుడే ఏదో విషయం ఉందని జనాలు భావించారు. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన శంబాల చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. డిసెంబర్ 25న శంబాల చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన రోజు నుంచి ప్రేక్షకుల ఆదరణను దక్కించుకున్న శంబాల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు 17 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం.

దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆది ఖాతాలో హిట్ పడటంతో అతని తండ్రి సాయికుమార్‌తో పాటు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన శంబాల సక్సెస్‌మీట్‌లో సాయికుమార్ ఆయన సోదరులు అయ్యప్ప, రవిశంకర్‌లు మాట్లాడుతూ వేదిక మీదే భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొనగా.. ఆది సాయికుమార్ అతని భార్య అరుణ గుడ్‌న్యూస్ చెప్పి ఈ ఆనందాన్ని మరింత రెట్టింపు చేశారు.

అరుణ, ఆదిలకు 2014లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక ఆడపిల్ల సంతానం. అయితే ఇటీవల అరుణ మరోసారి గర్భం దాల్చగా... తాజాగా ఆమె ప్రసవించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండవసారి మగబిడ్డకు అరుణ జన్మనిచ్చినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెబుతున్నారు. దీనిపై అధికారికంగా సాయికుమార్ కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. అయితే శంబాల ఘన విజయం సాధించడం.. పాప పుట్టిన ఇన్నేళ్ల తర్వాత వారసుడు జన్మించడంతో ఆది, సాయికుమార్ కుటుంబం సంతోషంగా ఉందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. తనకు బిడ్డ పుట్టిన విషయంపై ఆది త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: aadi saikumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X