Don't Miss!
- News
Bengaluru: అపార్ట్ మెంట్ లో ఏం జరిగింది ?, ఆ ఇద్దరూ ఒకే సారి ఎలా చనిపోయారు ?, భార్య ఎంట్రీతో ?
- Sports
INDvsAUS : టెస్టు సిరీస్ తర్వాత.. అశ్విన్ వల్ల వీళ్లకు పీడకలలు తప్పవు!
- Travel
ప్రకృతి రమణీయతకు నిదర్శనం.. హంసలదీవి!
- Technology
ఈ ఆపిల్ మ్యాక్ బుక్ తయారీ నిలిపి వేసిన Apple ! కారణం ఏంటో తెలుసుకోండి!
- Finance
Adani Bonds: అదానీ డాలర్ బాండ్లకు ఎదురుదెబ్బ.. ప్రమోటర్ల తాజా నిర్ణయం ఏమిటంటే..
- Lifestyle
మీ రోజువారీ ఆహారంలో ఈ 9 ఆహారాలు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి...
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
‘అఖండ’లో పూర్ణ చేసేది అలాంటి పాత్రనా: వాళ్లిద్దరి కాంబోనే సినిమాలో ప్రత్యేక ఆకర్షణ
వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం 'అఖండ'. రెండు భారీ విజయాల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ప్రయోగాత్మకంగా సరికొత్త కాన్సెప్టుతో రూపొందిస్తున్నారు. ఇక, ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. దీంతో ఈ మూవీపై నందమూరి అభిమానులు ఫుల్ కాన్పిడెన్స్‌తో ఉన్నారు. ఈ నేపథ్యంలో దీని గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.
'అఖండ' మూవీలో నందమూరి బాలకృష్ణను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటిస్తున్న విషయం తెలిసిందే. అతడి పాత్రను గత సినిమాల మాదిరిగానే వైవిధ్యంగా డిజైన్ చేస్తున్నాడట దర్శకుడు బోయపాటి శ్రీను. అంతేకాదు, ఇందులో సెకెండ్ హీరోయిన్‌గా చేస్తున్న సామ్నా కాశీం అలియాస్ పూర్ణ పాత్ర కూడా ఎంతో ప్రభావవంతంగా రాశాడట. వీళ్లిద్దరూ పెయిర్‌గా నటిస్తున్నారని.. ఈ కాంబోలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయని తెలిసింది. దీంతో వీళ్లిద్దరి పాత్రలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి పెరిగిపోతోంది.

'సింహా', 'లెజెండ్' వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'అఖండ'. ఇందులో నటసింహం రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.