శంకర్ సినిమాల్లోనే 2.0 చాలా చిన్నది.. రన్ టైం ఎంతో తెలుసా!
శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం 2.0. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తోంది. చిత్రానికి సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్ర రన్ టైం గురించి ఆసక్తికర విషయం తెలిసింది. సాధారణ చిత్రాల మాదిరిగా ఈ చిత్ర రన్ టైం 2: 28 గంటలు(148 నిమిషాలు) ఉన్నట్లు తెలుస్తోంది.
శంకర్ చిత్రాలలోకే 2.0 చాలా చిన్న చిత్ర అని అంటున్నారు. శంకర్ గత చిత్రాలని పరిశీలిస్తే ఐ 188 నిమిషాల నిడివి, రోబో 167 నిమిషాల నిడివి కలిగి ఉన్నాయి. గతంలో శంకర్ రూపిందించిన అపరిచితుడు లాంటి చిత్రాలు కూడా చాలా ఎక్కువ నిడివి కలిగి ఉండేవి.

అని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న 2.0 చిత్రం నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. అద్భుతమైన విజువల్ వండర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ ప్రధాన పాత్రలో నటించారు.


Click it and Unblock the Notifications











