Bharateeyudu 2: ప్రజల కోసం 'భారతీయుడుని' మళ్లీ తీసుకు వచ్చిన రాజమౌళి... కమల్, శంకర్ పెద్ద ప్లాన్ వేశారుగా!

ఎస్ఎస్ రాజమౌళి మళ్లీ భారతీయుడిని ఇండియాకు తీసుకువచ్చాడు. అదేంటి అనుకుంటున్నారా... దేశం మొత్తం ఎదురు చూస్తున్న సినిమాల్లో శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 ఒకటి. అయితే ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా 'ఇండియన్ 2'.. ఇంట్రో తెలుగులో రాజమౌళి చేతులు మీదుగా నిర్వహించారు. మరి ఆ ఇంట్రో ఎలా ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి.

లెజెండరీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ చిత్రం భారతీయుడు. ఈ చిత్రానికి దాదాపు చాలా ఏళ్ల తర్వాత సీక్వెల్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది ఇండియన్ 2. ఇక శంకర్ ఈ మూవీ ప్రమోషన్స్ అంటే మామూలుగా ఉండవు. ఇక ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టడానికి రెడీ అయ్యాడు.

Shankar Kamal Haasan Indian 2 Movie Teaser Released By SS Rajamouli

ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఇంట్రో అంటూ ఒక చిన్న టీజర్ ని ప్రేక్షకులకు కోసం వదిలాడు. ఇక ఈ ఇంట్రో తెలుగులో రాజమౌళి చేతులు మీదుగా ఘనంగా జరిగింది. భారతీయుడు మొదటి భాగం చివరిలో కమల్ హాసన్ ఇండియా వదిలి విదేశాలకు వెళ్లిపోయినట్లు చూపించారనే విషయం.. భారతీయుడు సినిమా చూస్తే అర్ధం అవుతుంది. అలాగే ఇండియాలో మళ్లీ అన్యాయం జరిగితే తాను తప్పకుండా వస్తానని... తనకి మరణం అనేది లేదని అప్పట్లో చూపించిన సంగతి తెలిసిందే.

Shankar Kamal Haasan Indian 2 Movie Teaser Released By SS Rajamouli

ఇక ఇండియన్ 2 ఇంట్రో... ఆ సీన్ తోనే మొదలు అవుతుంది. అలా వెళ్లిపోయిన భారతీయుడిని మళ్లీ రమ్మంటు దేశంలో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలు సోషల్ మీడియాలో రిక్వెస్టులు పెడుతుంటారు. ఇక వారి బాధ భారతీయుడుకి చేరుతుంది. దీంతో ఆయన మళ్లీ ఇండియాకు తిరిగి వస్తాడు. ఈ విషయాన్ని ఇంట్రోలో చక్కగా చూపించారు శంకర్.

ఇక ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. ఈ మనషులు ఎవరూ మారలేదు.. నువ్వు మరోసారి రావాల్సిందే అంటూ సాగిపోయే పాట ఆకట్టుకుంది. చివర్లో కమల్ హాసన్ మరోసారి భారతీయుడు గెటప్ లో ఎంట్రీ ఇస్తాడు. నమస్తే ఇండియా.. భారతీయుడు ఈజ్ బ్యాక్ అంటూ వస్తాడు. అక్కడితో ఈ ఇండియన్ 2 ఇంట్రో ముగుస్తుంది. ఇక ఈ టీజర్ ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారింది. మళ్లీ కమల్ హాసన్ హిట్ కొడతాడు అంటున్నారు.

Shankar Kamal Haasan Indian 2 Movie Teaser Released By SS Rajamouli

ఇక ఈ ఇంట్రో గమనిస్తే... శంకర్ స్టాండర్డ్ విజువల్స్ కనిపించాయి. ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా... హీరో సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చూపించారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి రిలీజ్ డేట్ గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X