భారీ సైన్స్ ఫిక్షన్ మూవీకి క్రేజీ డైరెక్టర్ ప్లానింగ్.. వందల కోట్ల బడ్జెట్!
ప్రస్తుతం భారతీయ చలన చిత్ర రంగంలో దర్శకుడు శంకర్ కు ప్రత్యేక స్థానం ఉంది. భారీ చిత్రాలని తెరకెక్కించడంలో శంకర్ సిద్ధహస్తుడు. సందేశాత్మక చిత్రాలని సైతం భారీ స్థాయిలో తెరకెక్కించిన విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంటాడు. ప్రస్తుతం శంకర్ 500 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కించిన 2.0 చిత్రాన్ని విడుదల చేసే పనిలో నిమగ్నమైన ఉన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తదుపరి చిత్రాల గురించి ప్రస్తావించాడు.
విశ్వనటుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నానని వివరించాడు. ఇటీవల ఈ చిత్ర లొకేషన్ వేటలో భాగంగా కడప జిల్లాలోని కొన్ని ప్రదేశాలని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం తరువాత భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నానని శంకర్ వివరించాడు. ఈ ప్రాజెక్ట్ కూడా కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ తో వందల కోట్ల బడ్జెట్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఏ హీరోతో ఈ సినిమా చేయబోతున్నాననే విషయాన్ని మాత్రం శంకర్ బయట పెట్టలేదు.


Click it and Unblock the Notifications











