ఇండియన్ 2 మొదలైంది.. 11 ఏళ్ల తర్వాత కమల్‌కు అదే క్రేజ్!

హాలీవుడ్‌ ప్రమాణాలకు ధీటుగా 2.0 చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత దర్శకుడు శంకర్ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఇండియన్ 2 సినిమాకు శ్రీకారం చుట్టారు. కమల్ హాసన్, కాజల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం జనవరి 18న చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది.

ఇండియన్ 2 మూవీ ముహుర్తం షాట్‌ కార్యక్రమంలో దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్, బ్యూటీ కాజల్ అగర్వాల్, నిర్మాతలు ఏఎం రత్నం, సుభాకరణ్, ఇతర సాంకేతిక నిపుణులు పాల్లొన్నారు. ఇండియన్ 2 సినిమాను లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్నది. 2.0 తర్వాత వరుసగా రెండో ప్రాజెక్ట్‌ను దర్శకుడు శంకర్‌తో రూపొందించడం విశేషం.

1996లో రిలీజైన భారతీయుడు సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా రూపొందుతున్నది. భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ మతోంద్కర్ తదితరులు నటించారు. అప్పట్లో భారతీయుడు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Shankars Indian2 started at Chennai

ఇండియన్ 2 చిత్రంలో హీరో సిద్ధార్థ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా కోసం శింబును ఎంపిక చేయగా కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారు.

సేనాధిపతి లుక్‌తో కమల్ ఉగ్రరూపంతో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఓల్డర్, వైజర్, డెడ్లియర్ అనే పదాలను పోస్టర్‌పై ముద్రించారు. ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X