శంకర్ మూవీలో మైఖేల్ జాక్సన్.. రజినీకాంత్‌ సినిమాతో బంపర్ ప్లాన్!

శంకర్ "రోబో" కి అప్పట్లోనే నెవర్ బిఫోర్ ప్లాన్.. కానీ ఎందుకు ఆగిపోయింది అంటే ఇప్పుడు అంటే ఇండియాన్ సినిమా దగ్గర కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు వస్తున్నాయి కానీ ఒక దశాబ్దల కాలం కితమే తన విజన్ తో మైండ్ బ్లాక్ చేసిన ప్రైడ్ ఇండియన్ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా శంకర్ అనే చెప్పి తీరాలి. కోలీవుడ్ లో తాను మొదటి సినిమా నుంచి చేసిన ప్రతీ సినిమా కూడా ఒక వండర్. సినిమాలో టెక్నకాజీ, గ్రాఫిక్స్ లతో అయితే శంకర్ ఒక ఆట ఆడుకున్నారు.

అలా శంకర్ చేసిన ది బెస్ట్ వర్క్స్ లలో ఒక ఊహించని విజువల్ వండర్ సినిమానే "రోబో". సూపర్ స్టార్ రజినీకాంత్ తో శంకర్ చేసిన ఈ మాసివ్ బడ్జెట్ విజువల్ వండర్ ఇండియన్ సినిమా నుంచి రోబోటిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి దుమ్ము లేపింది. అంతే కాకుండా తమిళ్, తెలుగు హిందీ భాషల్లో అయితే వసూళ్ల సునామి సృష్టించిన ఈ చిత్రంలో ఎన్నో వింతలు విశేషాలు కోసం ఇప్పటికీ మాట్లాడుకుంటారు.

Shankar wants michael jackson to play crucial Role Rajinikanth Robo movie but

ఐతే శంకర్ తన సినిమాలని ఎక్కడా తగ్గకుండా ది బెస్ట్ అండ్ టాప్ నాచ్ లో ఉండేలా ప్లాన్ చేస్తారని అందరికీ తెలుసు. అందుకే తన సినిమాలకి హాలీవుడ్ స్టార్స్ ని కూడా తీసుకొచ్చి ఓ రేంజ్ హైప్ ని అందిస్తారు. అలా రోబో సినిమా విషయంలో కూడా శంకర్ హాలీవుడ్ స్టార్ టెర్మినేటర్ ఫేమ్ ఆర్నాల్డ్ ని కూడా తన సినిమాకి రప్పించి హాట్ టాపిక్ అయ్యాడు.

కాగా ఇదే రోబో సినిమాకి మరో సంచలన ప్లాన్ ని అది కూడా ఇండియన్ సినిమా దగ్గర నెవర్ బిఫోర్ ప్లాన్ ని తాము చేసినట్టుగా సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ రివీల్ చేశారు. ఇప్పుడు సంగీత ప్రపంచంలో వరల్డ్ వైడ్ ఎంతోమంది పాప్ సింగర్స్ ఆర్టిస్ట్ లు ఉండొచ్చు వీరి అందరికీ వన్ అండ్ ఓన్లీ కింగ్ ఎవరైనా ఉన్నారు అంటే అది కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ అనే చెప్పుకోవాలి.

Shankar wants michael jackson to play crucial Role Rajinikanth Robo movie but

మైఖేల్ ఒక ఎరా మొత్తాన్ని తన పాటలు డాన్స్ లతో ఊపేసారు. మరి ఇలాంటి మైఖేల్ జాక్సన్ తో రోబో సినిమాలో ఓ పాటని వారు ప్లాన్ చేశారట. సినిమా చిత్రీకరణ 2008 లో మొదలైతే అప్పటి నుంచే రెండు సార్లు మైఖేల్ ని సాంగ్ కోసం కలిసి ఓకే చేసుకున్నారట. కానీ 2009 లోనే మైఖేల్ అకాల మరణం ప్రపంచాన్ని స్తంభింపజేసింది. 2010 లో సినిమా విడుదల అయ్యింది.

దీనితో ఈ సినిమాకి వర్క్ చేసే అవకాశం మిస్ అయ్యింది అని రెహమాన్ రీసెంట్ గా రివీల్ చేసిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకవేళ మైఖేల్ జాక్సన్ సాంగ్ కూడా ఉండి ఉంటే రోబో సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టించి ఉండేదో మరి.. కాగా ఇప్పుడు శంకర్ ఉలగనయగన్ కమల్ హాసన్ తో చేసిన ఇండియన్ 2 సినిమా రిలీజ్ తో రాబోతున్నారు.

More from Filmibeat

Read more about: shankar michael jackson
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X