twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంపేస్తామన్నారు.. ఎంత దూరమైనా వెళ్తా..మార్కెట్ లేదు అన్నందుకే ఇలా : బెల్లంకొండ మీద శరణ్

    |

    టాలీవుడ్ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ మీద ఫైనాన్షియర్ అలాగే సినీ నిర్మాతగా మారిన శరణ్ చీటింగ్ కేసు పెట్టిన అంశం సంచలనంగా మారింది. శరణ్ తనకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదని ఇస్తే ఎలాంటి పరిస్థితుల్లో అయినా తాను విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధం అంటూ బెల్లంకొండ సురేష్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. అయితే ఈ విషయం మీద శరణ్ తాజాగా ఒక ఛానల్ తో మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళితే

     డబ్బు ఇవ్వడం లేదని

    డబ్బు ఇవ్వడం లేదని


    హౌరా బ్రిడ్జ్ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన శరణ్ అనే వ్యక్తి నాంపల్లి కోర్టులో బెల్లంకొండ సురేష్ మీద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించమని పిటిషన్ వేశారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం గోపీచంద్ మలినేని, చోటా కె.నాయుడు, కోనవెంకట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని అనుకున్నామని ఆ సమయంలో తాను 85 లక్షల రూపాయలు బెల్లంకొండ సురేష్ కి ఇచ్చానని కానీ ఆ డబ్బు అడుగుతుంటే ఇప్పుడు బెదిరిస్తూ చంపేస్తామంటున్నారు కానీ డబ్బు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

    ఏమైనా చేసుకోవచ్చు

    ఏమైనా చేసుకోవచ్చు


    తాజాగా ఇదే విషయం మీద బెల్లంకొండ సురేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్మీట్లో మాట్లాడుతూ తన కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇమేజ్ పెరిగిపోవడంతో దానిని దెబ్బతీసేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు అని లీగల్ గా వెళతానని వదిలే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. లీగల్ గా వెళ్లి నరకం చూపిస్తాను చూడాలని ఆయన వార్నింగ్ లు ఇచ్చారు. అలాగే తనకు డబ్బులు ఇచ్చినట్లు కానీ కాల్స్ చేసినట్లు గాని ఉంటే రికార్డులలో ఉంటుంది కాబట్టి కోర్టు ద్వారా ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పుకొచ్చారు.

    12 కోట్ల రూపాయలతో

    12 కోట్ల రూపాయలతో


    అంతేకాక శరణ్ వెనక ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడని త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతా అని అన్నారు. తాజాగా ఈ విషయం మీద శరణ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ అసలు సురేష్ కి నాకు మధ్య జరిగిన విషయం ఇది అంటూ పూర్తి వివరాలు వెల్లడించారు. గోపీచంద్ మలినేని దర్శకుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చోటా కె నాయుడు కెమెరా మెన్ గా కోన వెంకట్ కధ అందిస్తే ఒక సినిమా చేయడానికి సిద్ధం అయ్యామని దానికి తనను సహనిర్మాతగా ఉండమంటే 12 కోట్ల రూపాయలతో సినిమా అవుతుంది అంటే ఉంటాను అని చెప్పాను అని వెల్లడించారు.

     ఇస్తాను ఇస్తాను అంటున్నారు కానీ

    ఇస్తాను ఇస్తాను అంటున్నారు కానీ


    అయితే కొన్ని సిట్టింగ్స్ తర్వాత దాని బడ్జెట్ 25 కోట్ల రూపాయలకు పెంచేశారు అని వెల్లడించారు. సాయి శ్రీనివాస్ కి అంత మార్కెట్ లేదు అతని మీద పాతిక కోట్లు ఖర్చు పెట్టడం అవసరం అని భావించి నేను ప్రాజెక్టు నుంచి తప్పుకుంటానని అప్పటి నుంచి డబ్బులు అడుగుతూ వస్తే ఇస్తాను ఇస్తాను అంటున్నారు కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు అని అన్నారు.

    ఎంత దూరమైనా వెళ్తా

    ఎంత దూరమైనా వెళ్తా


    ఆ మధ్య ఫోన్ చేస్తే చంపేస్తాం అని బెదిరించడంతో ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలతో కోర్టును ఆశ్రయించానని కోర్టు అన్నిటిని పరిశీలించి కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. సురేష్ పెద్ద మోసగాడు అని పేర్కొన్న శరణ్ నా చేత డి.వి.వి.దానయ్య కు డబ్బులు ఇప్పించారని అలాగే నేను అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బులు గోపీచంద్ మలినేని వెనక్కి ఇచ్చేశారని కూడా చెప్పుకొచ్చారు. లీగల్ గా ఎంత దూరమైనా వెళ్తానని సురేష్ ఇలా ఎంతో మందిని మోసం చేశాడు ఎన్నో కేసులు ఉన్నాయని అని చెప్పుకొచ్చారు.

    English summary
    sharan kumar responds on Bellamkonda Suresh's comments on him
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X