Sharathulu Varthisthai Trailer Review బలగం లాంటి షరుతులు వర్తిస్తాయి.. ట్రైలర్‌తోనే హిట్ ఫీలింగ్!

మనసులను, మనుషులను కదిలించే సినిమాలు సినీ తెరపై అరుదుగా ఆవిష్కరింప బడుతుంటాయి. తెలుగు వారందరినీ భావోద్వేగానికి గురిచేస్తూ హృదయంలో చెరగని ముద్ర వేసిన చిత్రాల్లో బలగం సినిమా ఇటీవల కాలంలో ప్రత్యేకంగా చెప్పుకొచ్చు. ఆ సినిమా స్పూర్తితో తెలంగాణ యాస్, భాష, సంస్కృతిని ప్రతిబింబించేలా చేసిన ప్రయత్నమే.. షరతులు వరిస్తాయి.

స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి కుమారస్వామి (అక్షర) ఈ సినిమాను రూపొందించారు. నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాతలుగా వ్యవహరించారు. మార్చి 15వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా మంచి స్పందన కనిపిస్తున్నది. ట్రైలర్ ఆవిష్కరణ సభలో నిర్మాతలు డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు మాట్లాడారు. ఈ ట్రైలర్ వివరాల్లోకి వెళితే..

Sharathulu Varthisthai Trailer Review Director Kumarswamy attempt emotional Rural Drama

కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగే చిరంజీవి, విజయశాంతి అనే ఇద్దరు యువతీ యువకుల ప్రేమ కథగా ట్రైలర్ చూస్తే అనిపించింది. అరకొర జీతంతో బాధపడే వ్యక్తి జీవితాన్ని ఓ ఆర్థిక సమస్య ఎలా తలకిందులు చేసింది అనే విషయం ప్రధాన పాయింట్‌గా కనిపించింది. బిజినెస్ ఇంట్రెస్ట్ లేని వ్యవహారంలో తలదూర్చడం వల్ల ఎలాంటి కష్టాల్లో కూరుకుపోయారనే ఎమోషనల్ పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కిందనే ఫీలింగ్ కలిగింది.

Sharathulu Varthisthai Trailer Review Director Kumarswamy attempt emotional Rural Drama

నీ జీతం పెరిగే సరికి.. నా జీవితం అయిపోతుందేమో, చైనా, జపాన్ వాళ్లు మనల్ని మోసం చేయలేదు. మనతోనే ఉంటూ.. మనతోనే తినే వాళ్లే మోసం చేశారనే సెంటిమెంట్ డైలాగ్స్ సినిమా చూడాలనే విధంగా అంచనాలు పెంచింది. చిరంజీవిగా యువ హీరో చైతన్యరావు, విజయశాంతిగా భూమిశెట్టి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ట్రైలర్ చూస్తే కుమారస్వామి తొలి చిత్ర దర్శకుడు అనే ఫీలింగ్ కలుగదు.

షరతులు వర్తిస్తాయి మూవీ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమోషనల్ అయ్యారు. ఒక మంచి ప్రయత్నం చేసినప్పుడు రకరకాల కష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. అలాంటి ఆటుపోట్లను తట్టుకొని మా నిర్మాతలను నష్టపోకుండా సేఫ్‌గా ఉంచుతూ ఈ సినిమాను పూర్తి చేశాను. హీరో చైతన్య, హీరోయిన్ భూమిశెట్టి అందించిన సహకారం మరువలేనిది. ష‌ర‌తులు వ‌ర్తిసాయి ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X