Sharathulu Vartisthai! అక్షర దర్శకత్వంలో షరతులు వర్తిస్తాయి.. మామిడి హరికృష్ణ చేతుల మీదుగా పోస్టర్
అప్పట్లో ఒకడుండే వాడు, నీది నాది ఒకే కథ, విరాటపర్వంతోపాటు పలు చిత్రాలకు దర్శకత్వం శాఖలో అనుభవం సాధించిన అక్షర కుమార్ అలియాస్ కుమారస్వామి దర్శకత్వంలో చైతన్య రావ్, భూమిశెట్టి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అర్బన్ టౌన్ సెటప్‌తో వాస్తవికతకు అద్దంపట్టే ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తున్నది. నాగార్జున్, శ్రీష్, కృష్ణకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ సాంస్కృతిక శాఖ రథ సారధి డాక్టర్ మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు.
తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్, కవి , సినీ విమర్శకులు, చరిత్ర కారులు, డాక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడు.. తూ క్యాచీ టైటిల్, యూనివర్సల్ ఎలిమెంట్స్‌తో నాణ్యమైన కథ, నైపుణ్యంతో కూడిన చిత్రీకరణ జరుగుతున్న ఈ చిత్రం పక్కాగా అన్ని వర్గాల వారిని అలరింపచేస్తుందని పేర్కొంటూ అందరకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మామిడి హరికృష్ణ గారు,హీరో చైతన్యరావ్,దర్శకులు కుమారస్వామి (అక్షర కుమార్ ) తదితరులు పాల్గొనడం జరిగింది.

దీపావళీ పండుగను పురస్కరించుకొని విడుదల చేసిన పోస్టర్‌లో కరీంనగర్ క్లాక్ టవర్‌ను ప్రధానంగా చూపించారు. దీంతో ఈ సినిమా కథ తెలంగాణ ప్రాంతంలో జరిగే సంఘటనలు, సాంస్కృతిక, సంప్రదాయాల నేపథ్యంగా తెరకెక్కుతున్నదనే విషయం స్పష్టమైంది.

షరతులు వర్తిస్తాయి సినిమా పోస్టర్‌పై మహాత్మ గాంధీ చెప్పిన సూక్తితోపాటు కుటుంబ వలయాన్ని ఒకటి పోస్టర్‌పై సృష్టించారు. మన సమస్యలకు ప్రధానం మన కోరుకొన్న కోరికలే అనే గాంధీ చెప్పిన కొటేషన్‌ను చూపించడంతో.. ఇది మానవ సంబంధాల నేపథ్యంగా తెరకెక్కినట్టు స్పష్టమైంది.



Click it and Unblock the Notifications











