‘Mahasamudram’ నుంచి గుడ్ న్యూస్: పిడికిలి బిగించి కనిపించిన ఇద్దరు హీరోలు
కొంత కాలంగా టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోన్న నేపథ్యంలో టాలెంటెడ్ హీరోలు శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తోన్న చిత్రం 'మహాసముద్రం'. అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సున్నితమైన ప్రేమకథతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే, మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణకు చాలా ఆలస్యం అయింది. దీంతో సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశాలు లేవన్న టాక్ వినిపించింది. ఈ పరిస్థితుల్లో తాజాగా దీని నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది.
Rx100 వంటి భారీ హిట్ తర్వాత చాలా కాలం వెయిట్ చేసి మరీ అజయ్ భూపతి 'మహాసముద్రం' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్టు అని ముందు నుంచీ చెబుతుండడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక, కరోనా ప్రభావం తగ్గడంతో ఈ మధ్యనే ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్.. తాజాగా పూర్తైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అందుకోసం ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో హీరోలు ఇద్దరూ శర్వానంద్, సిద్దార్థ్ పిడికిలులు బిగించి కనిపించారు. దీంతో ఈ పోస్టర్ తెగ వైరల్ అయిపోతుంది.

ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమ చిచ్చు పెట్టి.. వాళ్లను శత్రువులుగా మార్చేసిందన్న కాన్సెప్టుతో 'మహాసముద్రం' సినిమా తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా ఆద్యంతం ఎమోషనల్‌గా సాగుతుందని అంటున్నారు. ఇక, ఈ సినిమాలో అదితి రావ్ హైదరీతో పాటు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఓ సీనియర్ హీరోయిన్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు.


Click it and Unblock the Notifications











