విడుదలకు ముందే ‘మహాసముద్రం’ రేర్ రికార్డు: ఆ ఒక్కదానికే రూ. 10 కోట్లకు పైగా వసూలు

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో ఎక్కువ శాతం మల్టీస్టారర్ మూవీలే ఉంటున్నాయి. ఇప్పటి తరం హీరోలు ఇలాంటి చిత్రాలు చేయడానికి ముందడుగు వేస్తుండడం వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఇప్పుడు టాలీవుడ్‌లో బోలెడన్నీ మల్టీస్టారర్ చిత్రాలు పట్టాలపై ఉన్నాయి. అందులో 'మహాసముద్రం' ఒకటి. మొదటి చిత్రం RX100తో తన స్టామినాను నిరూపించుకున్న అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోలు శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.

సున్నితమైన ప్రేమకథకు భారీ స్థాయిలో భావోద్వేగాలను జోడించి 'మహాసముద్రం' సినిమాను రూపొందించాడు అజయ్ భూపతి. వాస్తవానికి ఈ చిత్రాన్ని పెద్ద స్టార్లతోనే తీయాలని దర్శకుడు భావించాడు. కానీ, అది సాధ్య కాకపోవడంతో శర్వానంద్, సిద్ధార్థ్‌తో దీన్ని తెరకెక్కించాడు. ఎప్పుడో మొదలైన ఈ చిత్ర షూటింగ్.. సెకెండ్ వేవ్ తర్వాత అంటే ఇటీవలే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలెట్టి దాదాపుగా కంప్లీట్ చేసేశారు. ఇటీవలే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

 Sharwanand and Siddharths Mahasamudram Digital Streaming Rights Sold Out

'మహాసముద్రం' మూవీని అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కాసేపటి క్రితమే ప్రకటించింది. ఇందుకోసం ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. సముద్రం బ్యాగ్రౌండ్‌తో ఉన్న ఈ పోస్టర్‌లో హీరోలు శర్వానంద్, సిద్ధార్థ్ ఒకరికొకరు తుపాకీలు గురి పెట్టుకుని నీటిలో నిల్చుని ఉన్నారు. వీళ్లిద్దరి మధ్యలో సముద్రపు అలల్లో హీరోయిన్ అతిథి రావు హైదరి కనిపిస్తోంది. తద్వారా ఇది ఇద్దరి మధ్య ప్రేమ వల్ల జరిగే సంఘర్షణతో తెరకెక్కిన చిత్రం అని తెలుస్తోంది. ఫలితంగా ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయనే చెప్పాలి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మహాసముద్రం' మూవీకి అన్ని ఏరియాల్లోనూ భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక, ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. 'మహాసముద్రం' చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ చేజిక్కించుకుందట. ఈ చిత్ర స్ట్రీమింగ్ రైట్స్ కోసం సదరు సంస్థ ఏకంగా రూ. 10.50 కోట్లు చెల్లించిందని తెలుస్తోంది. ఫలితంగా మీడియం రేంజ్ చిత్రాల్లో ఎక్కువ మొత్తం వసూలు చేసి విడుదలకు ముందే రికార్డు కొట్టేసింది.

శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్‌లో వచ్చిన 'మహాసముద్రం' సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కించాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమ చిచ్చు పెట్టి.. వాళ్లను శత్రువులుగా మార్చేసిందన్న కాన్సెప్టుతో ఇది తెరకెక్కినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఎమోషనల్‌గా సాగే ఈ సినిమాలో అదితి రావ్‌ హైదరీతో పాటు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన 'హే రంభ' అనే పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X