రవితేజ, నాగ చైతన్య తర్వాత శర్వానంద్.. యంగ్ హీరో చెంతకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు

By Manoj

'RX100' అనే సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపునకు తిప్పుకున్నాడు యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో నటీనటులతో పాటు దర్శకుడికీ మంచి పేరు వచ్చింది. కొంచెం అడల్ట్ సీన్స్ ఉన్నప్పటికీ ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. అయితే, ఈ మూవీ విడుదలై చాలా కాలం కావస్తున్నప్పటికీ.. ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించడం లేదు. కానీ, ఆయన మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

అజయ్ భూపతి ‘మహాసముద్రం'

అజయ్ భూపతి ‘మహాసముద్రం'

అజయ్ భూపతి ‘RX100' తర్వాత ‘మహాసముద్రం' అనే స్క్రిప్టును రెడీ చేశాడు. దీనిని మాస్ మహారాజ రవితేజను దృష్టిలో ఉంచుకుని రాసుకున్నాడు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఇందులో మరో హీరో సిద్దార్ద్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడని కూడా అన్నారు. కానీ, ఏమైందో ఏమో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. రవితేజ తర్వాత ఈ స్టోరీ అక్కినేని హీరో నాగ చైతన్య దగ్గరకు వెళ్లింది. ఆయనకు ఈ స్టోరీ బాగా నచ్చిందని, త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతుందనే టాక్ వినిపించింది.

 పరశురాంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్

పరశురాంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్

నాగ చైతన్య.. అజయ్ భూపతి సినిమాను పక్కన పెట్టేసి, ‘గీత గోవిందం' ఫేం పరశురాంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. దీంతో అజయ్ భూపతి ‘మహాసముద్రం' స్క్రిప్టును మరో యంగ్ హీరోకు వినిపించాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అతనెవరో కాదు.. శర్వానంద్. అవును.. ఈ యంగ్ హీరోకు అజయ్ భూపతి చెప్పిన స్టోరీ బాగా నచ్చిందట. త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించేందుకు అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

శర్వానంద్..‘96'

శర్వానంద్..‘96'

ప్రస్తుతం శర్వానంద్.. దిల్ రాజు బ్యానర్‌లో ‘96' తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్. దీనితో పాటు అతడు ‘శ్రీకారం' అనే మూవీలోనూ హీరోగా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ రెండింటి తర్వాత అజయ్ భూపతి సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X