twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెడ్డి దోస్తాన్ వాల్యూ చూపించిన రామ్ చరణ్.. యువ హీరోకు సడన్ సర్ ప్రైజ్

    |

    ఈ ప్రపంచంలో అన్నిటి కంటే గొప్ప వాటిల్లో ఫ్రెండ్షిప్ ఒకటి. ఎలాంటి సంబంధం లేకపోయినా రక్త సంబంధం కంటే ఎక్కువగా ఫీల్ అయ్యే ఆ బాండింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక నార్మల్ పర్సన్స్ దొరికినంత ఈజీగా సెలబ్రెటీలకు నిజమైన స్నేహితులు దొరకడం అనేది వాళ్ళకు అదృష్టమనే చెప్పాలి. హోదా చూసి పక్కకు వచ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇక కొందరు తారాలు మాత్రం అసలు స్టార్ డమ్ అంటే ఏమిటో తెలియని వయసులో నుంచే క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. రామ్ చరణ్ కు కూడా అలాంటి మంచి స్నేహితులు ఉన్నారు.

    అంత ఈజీగా మర్చిపోడు.

    అంత ఈజీగా మర్చిపోడు.

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వ్యక్తిత్వం ఎలాంటిదో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్కసారి నమ్మితే వాళ్ళను అంత ఈజీగా మర్చిపోడు. అలాగే సహాయ గుణంలో తండ్రిని బాబాయ్ ను కూడా తలపించేలా ముందుకు వెళుతున్నాడు. ఇక మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ అందుకున్నా కూడా చిన్ననాటి స్నేహితుల కలిస్తే వాటన్నిటినీ పక్కన పెట్టేస్తాడు.

    జూనియర్ ఎన్టీఆర్ తో..

    జూనియర్ ఎన్టీఆర్ తో..

    రామ్ చరణ్ కు ఇండస్ట్రీలో స్నేహితులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ఎంత సన్నిహితంగా ఉన్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చూస్తున్న విషయం తెలిసిందే. ఆ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకి రానుంది.

    చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్.

    చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్.

    కేవలం జూనియర్ ఎన్టీఆర్ అనే కాకుండా ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడు. అప్పుడప్పుడు వీళ్లంతా పార్టీలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక రానా దగ్గుబాటి, శర్వానంద్ వాళ్ళు చరణ్ కు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్.

    చెడ్డి దోస్తాన్ కు పుట్టినరోజు సర్ ప్రైజ్

    చెడ్డి దోస్తాన్ కు పుట్టినరోజు సర్ ప్రైజ్

    రానా, శర్వా, రామ్ చరణ్ చెడ్డి దోస్తాన్ అని అందరికి తెలిసిన విషయమే. స్టార్ వాల్యూ అంటే ఏమిటో తెలియని వయసు నుంచే వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. ఇక ఎవరి పుట్టినరోజు జరిగినా కూడా అర్థరాత్రి మొదటి సేకనులో కేక్ కట్ చేయాల్సిందే. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ తేజ్ కూడా శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గా కేక్ తో వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    రాబోయే సినిమాలు

    రాబోయే సినిమాలు

    రామ్ చరణ్ నెక్స్ట్ ఆచార్య, RRR సినిమాలతో రాబోతున్న విషయం తెలిసిందే. ఇక శర్వానంద్ శ్రీకారం అనే సినిమాతో రాబోతున్నాడు. శివరాత్రి సందర్భంగా విడుదల కానున్న ఆ సినిమా వ్యవసాయం కాన్సెప్ట్ తో వస్తున్న ఆ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి ఆ సినిమా స్థాయిలో హిట్టవుతుందో చూడాలి.

    English summary
    Director Rajamouli described his experiences as well as future plans in his first interview after recovering from Corona. Rajamouli, who fell a corona heavy a few days ago, has recently become an ideal for everyone with a plasma donation. However, in Corona Time, he said that he followed two things regularly and was scared of the virus. He also spoke on RRR, Mahabharata and Adi Purush projects.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X