Sharwanand: ఘనంగా హీరో శర్వానంద్ పెళ్లి.. ఎవరెవరు వచ్చారో తెలుసా? ఆరోజే రిసెప్షన్!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో ఒకరు శర్వానంద్. అతను ఏ సినిమా ఫంక్షన్స్ కు వెళ్లినా.. ఇంటర్వ్యూకు వెళ్లినా.. ఎక్కువగా వినిపించే ప్రశ్న పెళ్లెప్పుడు అని. అలాంటి శర్వానంద్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్న శర్వానంద్ తాజాగా ఓ ఇంటి వాడయ్యాడు. యంగ్ హీరో శర్వానంద్ వివాహానికి టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు హాజరై ఆశీర్వదించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో ఎవరెవరూ పాల్గొన్నారు.. రిసెప్షన్ ఎప్పుడు అనే విషయాల్లోకి వెళితే..
మాజీ మంత్రి మనువరాలు : ఈ ఏడాది జనవరి 26న ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్ గా నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటి వాడు అయ్యాడు. మాజీ మంత్రి, టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్ట్ లాయర్ మధుసూదన్ రెడ్డి కూతురు రక్షిత రెడ్డితో జూన్ 3న రాత్రి జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ వివాహం వైభవంగా జరిగింది.

జూన్ 2 నుంచే : జూన్ 2 నుంచే పెళ్లి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. జూన్ 2న ఉదయం హల్దీ ఫంక్షన్ జరగ్గా, అదే రోజు రాత్రి సంగీత్ నిర్వహించారు. శర్వానంద్ హల్దీ ఫంక్షన్స్ లో చేసిన సందడిస, సంగీత్ కార్యక్రమాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక జూన్ 3న అంటే శనివారం రోజున లీలా ప్యాలెస్ లోని విక్రమ్ ఆదిత్య బాల్ రూమ్ లో శర్వానంద్ ను పెళ్లి కొడుకును చేశారు.

సినీ సెలబ్రిటీలు : అనంతరం అదే రోజు (జూన్ 2) రాత్రి 11 గంటలకు శర్వానంద్, రక్షిత రెడ్డి వివాహం జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, విక్రమ్, ఆశిష్, హర్షిత్ తోపాటు దిల్ రాజు కుటుంబం నుంచి హన్షిత ఉన్నారు.

పెళ్లి వస్త్రాల్లో : శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ దంపతులు సందడి చేసిన వీడియోలు నెట్టింట్లో గింగిరాలు తిరిగాయి. వీరితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం హాజరై నూతన వధూవరులైన శర్వానంద్-రక్షిత్ రెడ్డిలను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో శర్వానంద్-రక్షిత పెళ్లి వస్త్రాల్లో చూడముచ్చటగా దర్శనం ఇచ్చారు. శర్వానంద్ పింక్ కలర్ షేర్వానీ ధరిస్తే.. రక్షిత సిల్వర్ క్రీమ్ కలర్ చీరతో కనువిందు చేశారు.

ప్రేమించి పెళ్లి చేసుకుని : ఇక శర్వానంద్-రక్షిత రెడ్డిల రిసెప్షన్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ రిసెప్షన్ పార్టీని జూన్ 9న హైదరాబాద్ లో నిర్వహించున్నానరని సమాచారం. ఇదిలా ఉంటే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తున్న రక్షిత రెడ్డిని శర్వానంద్ ప్రేమించి, తర్వాత పెళ్లికి పెద్దలను ఒప్పించాడని చాలా రోజులుగా టాక్ నడుస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











