మరో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న శర్వానంద్.. మొత్తానికి డేట్ కూడా సెట్ చేసుకున్నాడు

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ కెరీర్ మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. జయాపజయాలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. అవసరం అయితే రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని మరి.. మంచి సినిమాలను చేయాలని అనుకునే అతికొద్ది మంది నటీనటులలో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం ఈ హీరో శ్రీకారం సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే.

చాలా కాలం తరువాత పూర్తి తరహా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అది. ఇటీవల సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చారు. మార్చ్ 11న మహా శివరాత్రి కానుకగా వరల్డ్ వైడ్ గా సినిమాను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమా టీజర్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 9న సాయంత్రం 4గంటల 5నిమిషాలకు టీజర్ ను వదలబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. చూస్తుంటే శర్వానంద్ మరోసారి శతమానం భవతి లాంటి హిట్ కూడా కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది.

Sharwanand new movie sreekaram teaser release date

ఇక ఆ సినిమాతో పాటు ఆర్ఎక్స్100% దర్శకుడు అజయ్ భూపతితో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. మహాసముద్రం అనే ఆ సినిమాలో సిద్దార్థ్ కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. సీరియస్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాను ఆగస్ట్ 19న వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నట్లు ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక త్వరలో కోన వెంకట్ రాసిన ఒక థ్రిల్లర్ కథలో కూడా శర్వానంద్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X