పెళ్లిపై ఆసక్తికరంగా స్పందించిన శర్వానంద్.. అమ్మాయిలా అంటూ షాకింగ్ ఆన్సర్

సినిమా హీరోహీరోయిన్ల పెళ్లి సంగతులంటే యమ క్రేజ్ ఉంటుంది జనాల్లో. అందుకే యంగ్ హీరో గానీ, హీరోయిన్ గానీ కనిపిస్తే చాలు వారి వారి పెళ్లి సంగతుల గురించే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఈ కోవలోనే తాజాగా యంగ్ హీరో శర్వానంద్ అలాంటి ప్రశ్నే ఎదుర్కొన్నాడు. ఆయన తాజా సినిమా రణరంగం సినిమా ప్రమోషన్స్ పాల్గొనగా ఆయనకు పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైంది. దీంతో వెంటనే రియాక్ట్ అయిన శర్వానంద్.. ఆసక్తికరంగా బదులిచ్చాడు.

ఈ రోజు వరకు తనకు పెళ్లి గురించిన ఆలోచనే రాలేదని అన్నాడు శర్వానంద్. పైగా తనకు గాళ్‌ఫ్రెండ్స్ కూడా లేరని, అమ్మాయిలతో మాట్లాడమంటేనే తనకు సిగ్గని పేర్కొన్న ఆయన.. పెళ్లిపై ప్రస్తుతం ఎలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశాడు. తనకు భార్యగా రాబోయే అమ్మాయి ఎలా ఉండాలనే దానిపై కూడా పెద్దగా ఆలోచించలేదని ఆయన తెలిపారు. పెళ్లి సమయమొస్తే అన్నీ ఆటోమేటిగ్గా అయిపోతాయని చెప్పి ఆశ్చర్య పరిచారు శర్వానంద్.

 Sharwanand Reacts On his marriage

శర్వానంద్ తాజా సినిమా రణరంగం. ఆగస్టు 15 వ తేదీన విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. చిత్రంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో శర్వానంద్ ఆకట్టుకున్నాడు. తొలిరోజే రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 3.86 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి శర్వా కెరీర్ లో రికార్డు నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X