Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌‌... హిట్‌మ్యాన్ రోల్‌పై శర్వానంద్ ఏమన్నారంటే?

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో బయోపిక్‌లకు ఆదరణ పెరుగుతుండటంతో దర్శక నిర్మాతలు వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. భారత్‌లో క్రికెట్‌కు ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ఒక మతమైతే.. క్రికెటర్లు దేవుళ్లు. దాంతో క్రికెటర్ల జీవితాలను కూడా వెండితెరపై ఆవిష్కరించారు. ఎంఎస్ ధోనీ , కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, మిథాలీ రాజ్ వంటి క్రికెటర్ల జీవితాలు బయోపిక్‌లుగా వచ్చి ప్రేక్షకుల ఆదరను అందుకున్నాయి. టీమిండియాకు దూకుడు పరిచయం చేసిన సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర కూడా త్వరలో బయోపిక్‌గా రానుంది.

Also Read
Ustaad Bhagat Singh Day 4 Collections:దారుణంగా పడిపోయిన ఉస్తాద్ కలెక్షన్స్..పవన్ మూవీకి 4వ రోజు ఎన్ని కోట్లంటే
Ustaad Bhagat Singh Day 4 Collections:దారుణంగా పడిపోయిన ఉస్తాద్ కలెక్షన్స్..పవన్ మూవీకి 4వ రోజు ఎన్ని కోట్లంటే

తెరపైకి రోహిత్ శర్మ బయోపిక్?
తాజాగా మరో క్రికెట్ దిగ్గజం జీవిత కథను కూడా బయోపిక్‌గా తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆయన ఎవరో కాదు.. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఒక సినిమాకు కావాల్సినంత ముడిసరుకు, డ్రామా, లవ్ స్టోరీ, కష్టాలు, కన్నీళ్లు, విజయాలు, వివాదాలు అన్నీ రోహిత్ శర్మ జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. ఒకప్పుడు టీమిండియాలో స్థానం కోసం ఎదురుచూసిన వ్యక్తి.. భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజంగా ఎదిగాడు రోహిత్. విధ్వంసక వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్‌మెంట్ తర్వాత భారత్‌కు ఆ స్థాయిలో దొరికిన మరొక ఓపెనర్ రోహిత్ శర్మ. క్రికెటర్‌గా, కెప్టెన్‌గా భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసి హిట్‌మ్యాన్‌గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు రోహిత్ శర్మ.

Sharwanand Reacts to Rohit Sharma Biopic Rumours in Biker Trailer Launch Event

హిట్‌మ్యాన్ చరిత్ర
67 టెస్టులలో 4301 పరుగులు, 282 వన్డేలలో 11,577 పరుగులు, 159 టీ20లలో 4231 పరుగులు చొప్పున.. మూడు ఫార్మాట్‌లలో 20 వేల పరుగులు సాధించిన అరుదైన క్రికెటర్‌గా రోహిత్ శర్మి నిలిచాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీల సరసన స్థానం సంపాదించాడు విరాట్. టెస్ట్‌లు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్.. ప్రస్తుతం వన్డేలలో కొనసాగుతున్నాడు. వన్డేలలో 3 సార్లు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా, వన్డేలలో అత్యధిక పరుగులు (264) సాధించిన క్రికెటర్‌గా, వన్డేలలో అత్యధిక సిక్సర్లు (352) కొట్టిన క్రికెటర్‌గా అతని పేరిట చెక్కుచెదరని రికార్డులు ఉన్నాయి.

Recommended For You
40 ఏళ్లు దాటాక వెంటాడుతున్న ఆ డేంజర్... నటి ప్రియ ఎమోషనల్
40 ఏళ్లు దాటాక వెంటాడుతున్న ఆ డేంజర్... నటి ప్రియ ఎమోషనల్

రోహిత్ శర్మగా శర్వానంద్?
అలాంటి రోహిత్ శర్మ జీవితాన్ని తెరపైకి తీసుకురావాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. అయితే రోహిత్ క్యారెక్టర్‌ను పోషించేది ఎవరు? అంటూ చర్చ నడుస్తుండగా.. టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ పేరు ఎక్కుగా వినిపిస్తోంది. హైట్, పర్సనాలిటీ, ఇతరత్రా అంశాలతో శర్వానంద్ అయితేనే రోహిత్ రోల్‌కి పక్కగా సరిపోతారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై శర్వానంద్ స్పందించారు.

You May Also Like
 Ustaad Bhagat Singh: మిక్స్‌డ్ టాక్‌లోనూ ఉస్తాద్ ఊచకోత.. ధురంధర్ 2 సునామీలో పవన్ కళ్యాణ్ రికార్డ్!
Ustaad Bhagat Singh: మిక్స్‌డ్ టాక్‌లోనూ ఉస్తాద్ ఊచకోత.. ధురంధర్ 2 సునామీలో పవన్ కళ్యాణ్ రికార్డ్!

ఏప్రిల్ 3న బైకర్
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటిలు సంయుక్తంగా బైకర్ మూవీని నిర్మిస్తుండగా అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ వైబోధ సంగీతం అందిస్తుండగా.. జే యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ పాసాల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 3న బైకర్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా బైకర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ బయోపిక్‌ ప్రస్తావన వచ్చింది.

20 రోజుల షూట్.. 10 రోజుల డబ్బింగ్ వృథా? పుష్ప 2 పై బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన..
20 రోజుల షూట్.. 10 రోజుల డబ్బింగ్ వృథా? పుష్ప 2 పై బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన..

రోహిత్ శర్మ బయోపిక్‌పై శర్వానంద్ స్పందన
మీ ఫిజిక్‌కి రోహిత్ శర్మగారి బయోపిక్ చేస్తే బాగుంటుంది. బైకర్‌లో మీ ఫిజిక్ చూసిన తర్వాత రోహిత్ శర్మ కాదు.. విరాట్ కోహ్లీ బయోపిక్ చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. స్పోర్ట్స్ సబ్జెక్ట్ టచ్ చేశారు కాబట్టి.. మీరు స్పోర్ట్స్ సబ్జెక్ట్‌లో నటించాలని చాలా మంది కోరిక. మీ ఆలోచన? మీ ఓపీనియన్ ఏంటీ? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. శర్వానంద్ స్పందించారు. నాకు బయోపిక్ తీస్తున్న విషయాలు తెలియవు.. అయితే రోహిత్ శర్మ క్యారెక్టర్ నేను చేయాలని గాసిప్స్ వింటున్నా. కథ నా దాకా వచ్చినప్పుడు చూసుకుందాం, రోహిత్ జీవితం స్పూర్తిదాయం. వస్తే ఖచ్చితంగా చూద్దాం. అభినే చూడాలి మరి శర్వానంద్ ఆన్సర్ ఇచ్చారు. మధ్యలో రాజశేఖర్ స్పందిస్తూ.. ఆయన రోహిత్ శర్మ అయితే నేనే ఎంఎస్ ధోనీ అంటూ సరదాగా నవ్వించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా శర్వా తన మనసులోని మాటను బయటపెట్టడంతో రోహిత్ శర్మ బయోపిక్ పట్టాలెక్కించాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: sharwanand rohit sharma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X