twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శర్వానంద్ ‘మహాసముద్రం’ లుక్ రిలీజ్: తొలిసారి అలాంటి గెటప్‌లో టాలెంటెడ్ హీరో

    |

    బ్యాగ్రౌండ్ లేకపోయినా సినీ రంగంలోకి ప్రవేశించిన హీరోల్లో శర్వానంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన అతడు.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ అద్భుతమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపిస్తోన్న ఈ టాలెంటెడ్ హీరో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'మహాసముద్రం' అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా అతడి లుక్ రిలీజ్ అయింది.

    టాలెంటెడ్ హీరో శర్వానంద్.. లవర్ బాయ్ సిద్ధార్ద్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'మహాసముద్రం'. 'RX 100' సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయిన దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. సున్నితమైన భావోద్వేగాలతో కూడిన ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన శర్వానంద్ ఫస్ట్ లుక్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. మార్చి 6న శర్వానంద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగానే దీన్ని వదిలారు. ఇక, ఈ పోస్టర్‌లో శర్వా తొలిసారి పవర్‌ఫుల్ గెటప్‌తో దర్శనమిచ్చాడు. దీంతో ఈ సినిమాపైనా అంచనాలు పెరిగిపోయాయి.

     Sharwanands Mahasamudram Look Released

    'RX 100' వంటి హిట్ సినిమాను తెరకెక్కించినా.. రెండో ప్రాజెక్టు విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. సుదీర్ఘ విరామం తర్వాత అతడు తన డ్రీమ్ ప్రాజెక్టు 'మహాసముద్రం'ను పట్టాలెక్కించేశాడు. ఈ చిత్రంలో అదితి రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర దీన్ని నిర్మిస్తున్నారు. 'మహాసముద్రం' చిత్రాన్ని ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

    English summary
    Ajay Bhupathi worked as an AD to Veeru Potla and Ram Gopal Varma before fulfilling his directorial dream with ‘RX 100’ which turned out to be a massive success at the ticket counters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X