'రణరంగం'కు భారీ డిమాండ్.. అదరగొట్టిన ప్రీ రిలీజ్ బిజినెస్
యంగ్ హీరో శర్వానంద్ హీరోగా రూపొందిన తాజా చిత్రం 'రణరంగం'. 1980 - 90 దశకాలకు సంబంధించిన కథతో రూపొందిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్ధమైంది.
తాజాగా ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలిశాయి. ప్రాంతాల వారీగా చూస్తే ప్రీ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో 5 కోట్లు, వైజాగ్ లో 1.5 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1 కోటి, పశ్చిమ గోదావరి జిల్లాలో 80లక్షలు, కృష్ణ లో 1కోటి, గుంటూరులో1.2కోట్లు నెల్లూరులో 50లక్షలు, సీడెడ్ లో 2 కోట్లు మేర బిజినెస్ చేసిందని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే వరల్డ్ వైడ్ రణరంగం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 16 కోట్లుగా నమోదైనట్లు చెబుతున్నారు.

సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'రణరంగం' చిత్రానికి నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించాడు. చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. విలక్షణ కథాంశంతో తెరకెక్కిన ఈ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇందులో శర్వానంద్‌ని సరికొత్త యాంగిల్‌లో చూపించనున్నారని ఇటీవలే విడుదలైన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక కాజల్ అందాలు సినిమాకు ప్లస్ కానున్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











