twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రణరంగం ట్రైలర్: చికెన్ ముక్కతో చంపేశాడు.. సీఎంగా ఎన్టీఆర్ చేసిన పనిని గుర్తు చేశారు

    |

    టాలీవుడ్‌లోని యంగ్ హీరోలో శర్వానంద్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్వతహాగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు.. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో ఎన్నో పరాజయాలను చూసినప్పటికీ తట్టుకుని నిలబడ్డాడు. యాక్టింగ్‌తో తనకు తానే అనుకునేంత రీతిలో శర్వా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తన అభిమానులు గర్వంగా చెప్పుకునేందుకు వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన తాజా చిత్రం 'రణరంగం'. 1980 - 90 దశకాలకు సంబంధించిన కథతో రూపొందిందీ సినిమా.

    ఆదివారం సాయంత్రం కాకినాడలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 'రణరంగం' ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో శర్వాను సరికొత్త యాంగిల్‌లో చూపించారు. ముఖ్యంగా అతడి హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఈ సినిమా ఉందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. అలాగే ఈ సినిమాలో వైలెన్స్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్లేట్‌లో ఉన్న చికెన్ లెగ్ పీస్‌తో ఒక వ్యక్తిని పొడిచి చంపడం మరే సినిమాలోనూ చూసి ఉండరు.

    Sharwanands Ranarangam trailer released

    అలాగే, ఈ ట్రైలర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును గుర్తు చేసింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ 1994లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మద్యనిషేధం విధించిన సంగతి తెలిసిందే. అప్పటి కథ నేపథ్యంలో ఈ సినిమాను విశాఖ పట్నం నేపథ్యంలో తెరకెక్కించారు. అక్కడ హీరో లిక్కర్ సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే దానిపై ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతుంది.

    ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

    English summary
    Sharwanand starrer 'Ranarangam' is creating good interest. Kajal Aggarwal and Kalyani Priyadarshan are the leading women of the film. Sharwanand will be seen in two avtaars. Ranarangam is a story of a man who 'grew to become an empire himself'. It will release on August 15.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X