twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీకారం నిర్మాతలకు శర్వానంద్ లీగల్ నోటీసులు.. ఆ విషయంలోనేనా, అసలేమైంది?

    |

    యంగ్ హీరో శర్వానంద్ వరుసగా వైవిధ్యభరిత సినిమాలు అంగీకరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకపక్కశ్రీకారం వంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలు ఒప్పుకుంటూనే మరోవైపు మహాసముద్రం వంటి మాస్ సినిమాలో నటిస్తున్నాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంటర్ అయిన ఆయన తనకంటూ మంచి ఫ్యాన్స్ బేస్ ఏర్పరుచుకున్నాడు. తాజాగా ఆయన ఒక సినిమా విషయంలో లీగల్ నోటీసులు పంపినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

    ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా

    ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా

    సహజ సిద్ధమైన నటనతో ఎన్నో సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటున్న శర్వానంద్ ఫలితాల పరంగా మాత్రం నిరాశనే ఎదుర్కొంటున్నాడు. ఎందుకో ఏమో కానీ ఆయన చేస్తున్న అన్ని సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ ముందు బోల్తా పడుతున్నాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో 'శ్రీకారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది కూడా అతడిని హిట్ ట్రాక్ ఎక్కించ లేక పోయింది. అయితే ఈ మధ్యనే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా అక్కడ మాత్రం అదరగొడుతోంది.

    ఒటీటీలో సూపర్ హిట్

    ఒటీటీలో సూపర్ హిట్

    శర్వానంద్ హీరోగా కిశోర్ రెడ్డి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన 'శ్రీకారం సినిమా మంచి టాక్ తెచ్చుకుంది'. వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలు, దానికి చదువు తోడైతే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద తీసిన ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. విమర్శకులు సైతం ప్రశంసించేలా దీన్ని తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్‌తో పాటు రివ్యూలు కూడా అనుకూలంగా వచ్చాయి. కానీ, కలెక్షన్ల పరంగా మాత్రం అంచనాలు తప్పాయి.

    రెమ్యునరేషన్ టెన్షన్

    రెమ్యునరేషన్ టెన్షన్

    అయితే ఈ సినిమా రెమ్యునరేషన్ విషయంలో ఆయన ఇప్పుడు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాడని అంటున్నారు. మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు శ్రీకారం సినిమాను నిర్మించిన 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్‌కు శర్వానంద్ లీగల్ నోటీసు ఇచ్చినట్లు సమాచారం. జరుగుతున్న ప్రచారం మేరకు 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ శ్రీకారం సినిమాకి శర్వానంద్ రూ .6 కోట్ల వేతనం చెల్లించడానికి అంగీకరించింది. వారు ముందు రూ .4 కోట్లు చెల్లించారు, తరువాత మరో రూ .50 లక్షలు చెల్లించారరని అంటున్నారు.

    లీగల్ నోటీసులు

    లీగల్ నోటీసులు

    అయితే మేకర్స్ ఇంకా రూ .1.5 కోట్లు శర్వానంద్ కి చెల్లించాల్సి ఉందట, కానీ నిర్మాతల నుంచి స్పందన సంతృప్తికరంగా లేని కారణంగా ఆయన వారికి లీగల్ నోటీసు పంపించాడని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్‌స్ లో సంచలనంగా మారింది. ఈ వివాదంపై 14 రీల్స్ ప్లస్ ఇంకా స్పందించలేదు. ఈ విషయం మీద 14 రీల్స్ సంస్థ స్పందిస్తే దీనికి సంబంధించిన క్లారిటీ రావచ్చు.

    Recommended Video

    Sreekaram, Jathi Ratnalu పోటాపోటీ.. కలెక్షన్స్ రిపోర్ట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్
    మహాసముద్రంతో

    మహాసముద్రంతో


    ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శర్వానంద్ 'మహా సముద్రం' చేస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోంది.'ఆర్ఎక్స్ 100' హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అజయ్ భూపతి చేస్తున్న కథ కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

    English summary
    Sharwanand who came Sreekaram, has reportedly served a legal notice to 14 Reels Plus Entertainments. reports suggest that legal action is related to his pending remuneration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X