అమ్మో! సమంత డేంజరస్.. నిజంగా చెప్తున్నా నేనందుకే పెళ్లి చేసుకోలేదు.. శర్వానంద్ కామెంట్స్
అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత చాలా డేంజరస్ అంటూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. నిన్న (శనివారం) హైదరాబాద్‌లో జరిగిన 'జాను' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శర్వా మాటల తూటాలు పేలాయి. ఈ మేరకు తన మ్యారేజ్ సీక్రెట్ కూడా చెప్పేశాడు శర్వానంద్. ఇంతకీ ఆయన కామెంట్స్ ఏంటి? వివరాల్లోకి పోతే..

సమంత 'జాను'.. నాని కూడా
సమంత తాజా సినిమా 'జాను'. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ సినిమా ఈ నెల 07న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్బంగా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు నాని ముఖ్య అతిధిగా విచ్చేశారు.

సమంతతో యాక్టింగ్.. శర్వానంద్ లవ్ బ్రేకప్
ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన శర్వానంద్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘జానీ' సినిమా గురించి చెప్తూ.. తన లవ్ బ్రేకప్, సమంతతో యాక్టింగ్ లాంటి విషయాల పట్ల ఎంతో ఫన్నీగా స్పందించి వేడుకను ఉత్సాహభరితం చేశాడు.

సమంత చాలా డేంజరస్.. అంతా భయపడతారు
ముందుగా జను ఈవెంట్‌కి వచ్చిన నాని అభిమానులకు, సమంత అభిమానులకు, తన అభిమానులకు చాలా థాంక్స్ చెప్పిన శర్వా.. సమంత చాలా డేంజరస్ అన్నాడు. చాలా మంది హీరోలకు సమంత లాంటి హీరోయిన్‌తో చేయాలంటే ఆలోచనలో పడతారు. ఎందుకంటే స్క్రీన్ మీద వాళ్లతో చేస్తున్నప్పుడు వాళ్లు తమకంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చి డామినేట్ చేస్తారు. అందుకే భయపడతారు అని అన్నాడు.

సమంత సక్సెస్ సీక్రెట్.. మొదటినుంచీ ఆమె
సమంతతో నటించడం తనకు ఇదే తొలిసారి అని, సమంత సక్సెస్ సీక్రెట్ ఏంటంటే.. ఆమె చేసే ప్రతి సినిమాను ఫస్ట్ సినిమాగానే భావిస్తుందని అన్నాడు శర్వానంద్. ఆమె మొదటి సినిమా నుంచి ఇప్పటికీ అలాగే చేస్తోందని ఆయన చెప్పాడు.

దానికి కారణం ఆమెనే అవుతుంది
సమంతను చూసి తాను చాలా నేర్చుకున్నానని, ప్రతి సీన్‌పై ఆమె చాలా కేర్ తీసుకుంటారని చెప్పాడు శర్వా. అందుకే ఆమె సూపర్ స్టార్ అయ్యారని.. ఆమెతో జాను చేయడం చాలా హ్యాపీగా ఉందని అన్నాడు. తన వల్ల ఆమెకు క్రెడిట్ రావడం కాదు.. తాను బాగా చేశాననే పేరు వస్తే దానికి కారణం జాను అవుతుందని శర్వా తెలిపాడు.

అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు..
ఇక ఈ మధ్య కాలంలో 6వ తరగతి నుండి లవ్‌లు మొదలవుతున్నాయని, ఆరో తరగతి అబ్బాయి నుండి 80 ఏళ్ల వరకూ అందరికీ ఈసినిమా కనెక్ట్ అవుతుందని అన్నాడు శర్వా. ''జీవితంలో ఏది జరిగినా ఎన్ని లవ్‌లు వచ్చినా.. ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్వే. ఈ సినిమా చూస్తున్నంత సేపూ... ఈ సీన్ నాది కదరా అని ఇన్వాల్వ్ అవుతారు. నా లవ్ స్టోరీ కూడా జాను లవ్ స్టోరీ మాదిరే ఉంటుంది. అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు. నిజంగా చెప్తున్నా.. నాకు అందుకే కనెక్ట్ అయ్యింది'' అని శర్వా తెలిపాడు.


Click it and Unblock the Notifications











