Mahasamudram trailer: మహాసముద్రం లాంటి శర్వానంద్.. హై వోల్టేజ్ లాంటి సిద్దార్ట్!

ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా దర్శకుడు చేయబోయే తదుపరి సినిమాలపై అంచనాలు ఏ తరహాలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆర్ఎక్స్ 100 సినిమాతో కల్ట్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అజయ్ భూపతి కూడా ఎలాంటి సినిమాతో వస్తాడో అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక అజయ్ నెక్స్ట్ స్క్రిప్ట్ లో ప్రేమతో పాటు ఎమోషన్ ను కూడా జత చేసి మహా సముద్రం అనే సినిమాతో రాబోతున్నాడు. అక్టోబర్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను నేడు విడుదల చేశారు. ఇక ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు స్థాయిని పెంచేసింది.

ఆర్ఎక్స్ 100 హిట్ అయిన తర్వాత అజయ్ భూపతికి బడా నిర్మాత నుంచి ఆఫర్స్ గట్టిగానే వచ్చాయి. అయితే అతను సెలెక్ట్ చేసుకున్న ప్రయోగాత్మకమైన మహాసముద్రం కథ మాత్రం కాస్త కమర్షియల్ హంగులకు దూరంగా ఉండడంతో కొంతమంది నిర్మాతలు ఆ సినిమాను తెరకెక్కించడానికి వెనుకడుగు వేశారు. మొత్తానికి దర్శకుడు అనిల్ సుంకరను మెప్పించి అజయ్ మహా సముద్రం సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎంత ఆలోచింపజేసే విధంగా ఉంది. హీరో శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీలో అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

విభిన్నమైన ప్రేమకథతో అనేక రకాల ఎమోషన్స్ ను హైలెట్ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగానే ఉన్నట్లు అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత సిద్ధార్థ్ ఒక విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక సముద్రం చాలా గొప్పది మావ.. చాలా రహస్యాలను తనలోనే దాచుకుంటుంది.. అని శర్వా చెప్పిన డైలాగ్ తో పాటు.. 'నువ్వు సముద్రం లాంటి వాడివి అర్జున్ నీలో కలవాలని అని నదులు కోరుకుంటాయి' అని అదితీరావ్ చెప్పిన డైలాగ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే జగపతి బాబు రావు రమేష్ వంటి టాలెంటెడ్ నటులు కూడా ఈ సినిమాలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కే జి ఎఫ్ చాప్టర్ వన్ విలన్ కూడా ఇందులో మెయిన్ విలన్ గా కనిపిస్తున్నాడు.

Sharwanand siddharth Mahasamudram movie telugu trailer

మనకు ఇక్కడ నచ్చినట్లు బ్రతకాలి అంటే మన జాతకాలు దేవుడు ముందు కొట్టే రాసి ఉండాలి.. అనే డైలాగ్ కూడా ఎంతగానో ఆలోచింపజేస్తుంది. 'నేను దూరదర్శన్ లో మహాభారతం చూసిన మనిషిని రా ఎదుటి వాడు వేసిన బాణానికి ఎలాంటి బాణం వేయాలో నాకు బాగా తెలుసు..' అని రావు రమేష్ కూడా పవర్ఫుల్ డైలాగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక సిద్ధార్థ కూడా చాలా కాలం తర్వాత ఒక విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఒక విధంగా తనలోని సరికొత్త నటుడిని బయటపెట్టినట్లు తెలుస్తోంది. చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకునే అవకాశం ఉంది. మరి దర్శకుడు అజయ్ భూపతి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X