twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి వారసత్వం ఎవ్వరికీ దక్కదు... ఆ స్థాయి ఆ ఒక్కడికే.. శర్వానంద్ షాకింగ్ కామెంట్స్

    |

    వ్యవసాయం, రైతు కథా నేపథ్యంగా రూపొందిన శ్రీకారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న శ్రీకారం విడుదల కానున్నది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి వేగం పెంచారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా శర్వనాంద్ మాట్లాడుతూ..

    బాస్ అంటే నాకు భయం

    బాస్ అంటే నాకు భయం

    నా బాస్ చిరంజీవి గారి ముందు మాట్లాడటం నాకు భయంగా ఉంది. ఎప్పుడూ ఆయన ముందు మాట్లాడటం లేదు. అందుకే చాలా పాయింట్లు మరిచిపోకుండా నేను రాసిపెట్టుకొన్నాను అని శర్వానంద్ తెలిపారు.

     నా మొదటి సినిమా శంకర్‌దాదా ఎంబీబీఎస్

    నా మొదటి సినిమా శంకర్‌దాదా ఎంబీబీఎస్

    నా మొదటి సినిమా శంకర్‌దాదా ఎంబీబీఎస్. నేను చూసిన మొదటి విజయం ఆ సినిమానే. ఆ చిత్రంలో నాకు వేషం ఇచ్చి నా కెరీర్‌కు , నా విజయానికి శ్రీకారం చుట్టింది మెగాస్టార్ చిరంజీవి. నా శ్రీకారం సినిమా ఫంక్షన్‌కు రావడానికి ఒప్పుకోవడంతోనే ఈ మూవీ సక్సెస్ అయిందని భావిస్తున్నాను.

     నీ సంకల్పం గొప్పదైతే.. నీ తలరాత మారుస్తుంది

    నీ సంకల్పం గొప్పదైతే.. నీ తలరాత మారుస్తుంది

    శ్రీకారం ఫంక్షన్ సందర్భంగా గతంలో చిరంజీవి నాకు చెప్పిన ఓ మాట చెప్పారు. నీ సంకల్పం గొప్పదైతే అదే నీ తలరాతను మారుస్తుంది అని చిరంజీవి చెప్పిన ఎప్పుడూ నా గుండెలో ఉంటుంది. థ్యాంక్స్ సార్. మీరు గొప్ప మాటలను చెప్పినందుకు థ్యాంక్స్. వాటిని ప్రతీ రోజు షూటింగుకు వెళ్లే ముందు ఆ మాటలను తలచుకొంటాను అని అన్నారు. ఆ సంకల్పమే మీ ముందు నిలబడేలా చేసింది. మీ మాటల వల్లే అది సాధ్యమైంది అంటూ శర్వానంద్ అన్నారు.

     రాంచరణ్ అంటే నాకు గర్వంగా

    రాంచరణ్ అంటే నాకు గర్వంగా

    నేను గర్వంగా చెప్పుకొనే పేరు, నా మిత్రుడు రాంచరణ్ తేజ్ పేరు. శ్రీకారం సినిమాకు ముందు నుంచి అండగా ఉంటున్న నా మిత్రుడు రాంచరణ్ గురించి చెప్పుకోవాలి. నా సినిమా ట్రైలర్ రిలీజైనప్పుడు ఫోన్ చూసి నాకు కంగ్రాట్స్ చెప్పారు. నీ సినిమా కోసం ఏం చేయాలో చెప్పు.. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని మా టీమ్‌కు కాన్ఫిడెన్స్ ఇచ్చారు అని శర్వానంద్ చెప్పారు.

     చిరంజీవి వారసత్వం రాంచరణ్‌కే

    చిరంజీవి వారసత్వం రాంచరణ్‌కే

    అంతేకాకుండా నా సినిమాకు బ్రహ్మండంగా ప్రమోట్ చేయాలని చిరంజీవి గారికి రాంచరణ్ చెప్పారు. నా ఫ్రెండ్ మాటను మన్నించి నా సినిమా ఫంక్షన్‌కు చిరంజీవి వచ్చారు. అందుకు రాంచరణ్‌కు ధన్యవాదాలు. వారసత్వాలు చాలామందికి ఆస్తుల ద్వారా సంక్రమిస్తుంది. చిరంజీవి క్యారెక్టర్, వారసత్వం రాంచరణ్ తేజ్‌కు వచ్చింది. ఆ స్థాయి మళ్లీ రాంచరణ్‌కే వచ్చింది. ఇంకెవ్వరికి ఆ వారసత్వం దక్కదు. చిరంజీవి, రాంచరణ్ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను ప్రతీ సినిమా మీకు థ్యాంక్స్ చెబుతుంది అని శర్వానంద్ అని అన్నారు.

    English summary
    Actor Sharwanand's Sreekaram Pre Release Event is organised at Khammam Town. Megastar Chiranjeevi is the chief guest for the function. On this occassion, Fans welcomes grandly to Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X