Sharwanand: శర్వానంద్ పెళ్లి డేట్ ఫిక్స్.. బాలీవుడ్ హీరోల తరహాలో.. ఎక్కడంటే?
ప్రస్థానం, గమ్యం సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన యంగ్ హీరో శర్వానంద్ రన్ రాజా రన్, శతమానం భవతి, ఒకే ఒక జీవితం వంటి తదితర చిత్రాలతో హిట్ కొట్టాడు. వరుసగా ఐదు ఫ్లాప్ లు చవిచూసిన శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార బ్యానర్స్ లో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇదివరకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన రక్షిత రెడ్డితో శర్వానంద్ కు ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయింది.
ప్రభాస్ తర్వాత:టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో ఎక్కువగా వినిపించే పేర్లు ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే.. మరొకటి శర్వానంద్. ప్రభాస్, శర్వానంద్ ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా పెళ్లి ఎప్పుడు అనే వార్త కచ్చితంగా ఉంటుంది. ఇక వీళ్ల పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అంతా ఇంతా కాదు. అయితే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో శర్వానంద్ ను పెళ్లి గురించి అడిగితే.. ప్రభాస్ తర్వాత అని చెప్పి తప్పించుకున్నాడు. కానీ అతనికంటే ముందే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.

డెస్టినేషన్ వెడ్డింగ్:జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వర్క్ చేస్తున్న రక్షిత రెడ్డి అనే యువతిని శర్వానంద్ ప్రేమించి, తర్వాత పెళ్లికి పెద్దలను ఒప్పించాడని టాక్ వస్తోంది. ఇప్పుడు అయితే వీరి పెళ్లి తేది హాట్ టాపిక్ అవుతోంది. శర్వానంద్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నాడు. అయితే విదేశాల్లో కాకుండా ఇండియాలోని జైపూర్ లోని లీలా ప్యాలెస్ (Leela Palace Jaipur) లో శర్వానంద్-రక్షిత పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు జరగనున్నాయి.

తొలిసారిగా:హీరో శర్వానంద్ వివాహం జూన్ 2, 3 తేదిల్లో జరగనున్నట్లు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీలందరూ తమ పెళ్లిని రాజస్థాన్ లో చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తొలిసారిగా వాళ్లను అనుసరిస్తున్నట్లుగా శర్వానంద్ రాజస్థాన్ జైపూర్ లో వివాహం చేసుకోనున్నాడు.

కొవిడ్ ప్రభావం:ఇదిలా ఉంటే రక్షిత రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అని తెలుస్తోంది. అంతేకాకుండా.. రక్షిత రెడ్డి ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ మనువరాలని సమాచారం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తున్న రక్షిత రెడ్డి కొవిడ్ ప్రభావంతో ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందని సమాచారం.

సైలెంట్ గా:ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పి శర్వానంద్ తన ఇంట్లో వాళ్లను ఒప్పించాడని ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. అయితే రక్షిత రెడ్డిని శర్వానంద్ ఎక్కడ.. ఎలా.. ఎప్పుడు కలిశాడు.. ఇదంతా ఎప్పుడు జరిగిందని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయం గురించి శర్వానంద్ నుంచి గానీ, వాళ్ల కుటుంబం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇదివరకు కూడా నిశ్చితార్థాన్ని ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా నిర్వహించారు.


Click it and Unblock the Notifications











