‘శ్రీకారం’ మూవీకి అందులో భారీ స్పందన: థియేటర్‌లో అలా.. ఓటీటీలో భారీగా
స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించినా.. అద్భుతమైన టాలెంట్‌తో హీరోగా నిలదొక్కుకోగలిగాడు సెటిల్డ్ యాక్టర్ శర్వానంద్. సహాజ సిద్ధమైన నటనతో ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చుకున్న అతడు.. ఫలితాల పరంగా మాత్రం నిరాశనే ఎదుర్కొంటున్నాడు. దీనికి కారణం అతడు చేసిన చిత్రాల్లో చాలా వరకు బాక్సాఫీస్ ముందు బోల్తా పడడమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో 'శ్రీకారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది కూడా అతడిని హిట్ ట్రాక్ ఎక్కించడంలో విఫలమైంది. కానీ, ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది.
శర్వానంద్ హీరోగా కిశోర్ రెడ్డి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన చిత్రమే 'శ్రీకారం'. వ్యవసాయ రంగంలోని సమస్యలపై తీసిన దీనికి మంచి స్పందన వచ్చింది. విమర్శకులు సైతం ప్రశంసించేలా దీన్ని తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్‌తో పాటు రివ్యూలు కూడా అనుకూలంగా వచ్చాయి. కానీ, కలెక్షన్ల పరంగా మాత్రం చాలా తక్కువ వచ్చాయి.

దీంతో ఇది డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే, ఇటీవల ఈ చిత్రం సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. అక్కడ మాత్రం ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొద్ది రోజుల్లో వంద మిలియన్ మార్కును కూడా చేరే అవకాశం ఉందని సమాచారం.
సందేశాత్మకంగా వచ్చిన 'శ్రీకారం' మూవీని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట దీన్ని నిర్మించారు.టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇందులో శర్వానంద్‌తో పాటు రావు రమేష్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











