శ్రీలీల అడ్రస్ గల్లంతు .. వైరల్‌గా మారిన సిసలైన 'కిస్సిక్' బ్యూటీ
ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియా వైడ్ గా కూడా మంచి హాట్ ఐటెం సాంగ్స్ కి క్రేజ్ ఎప్పటి నుంచో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ ఐటెం సాంగ్స్ విషయంలో నెమ్మదిగా ట్రెండ్ మారుతూ ఆ సాంగ్స్ కోసం అంటూ కొందరు స్టార్స్ నుంచి ఇపుడు వాటిని డైరెక్ట్ గా హీరోయిన్లే చేసే విధంగా పరిస్థితులు మారిపోయాయి.
కాగా ఇపుడు ఇండియా వైడ్ గా షేక్ చేస్తున్న ఐటెం సాంగ్ ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన బిగ్ సీక్వెల్ చిత్రం పుష్ప 2 లోని కిస్సిక్ సాంగ్ అని చెప్పాలి. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల మొట్టమొదటిసారిగా ఐటెం భామగా మారింది.

అయితే చాలా చిన్న ఏజ్ లోనే శ్రీలీల ఐటెం సాంగ్ చేయగా దీనికి ముందు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయట. కానీ తాను పుష్ప 2 మాత్రమే ఓకే చేశాను అని చెప్పుకొచ్చింది. కాగా తనకి వచ్చిన ఆఫర్ ని శ్రీలీల ఓ రేంజ్ లో సద్వినియోగం చేసుకుందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. మరి తనకి ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేదా అనే రేంజ్ లో పుష్ప రాజ్ సరసన శ్రీలీల తన డ్యాన్స్‌తో విరుచుకుపడింది.
నిజంగానే ఒక డాన్సింగ్ డైనమైట్ లా ఈ సాంగ్ లో షైన్ అయ్యి అదరగొట్టింది. కానీ శ్రీలీలను కూడా డామినేట్ చేస్తూ ఒకమ్మాయి ఇపుడు అల్లు అర్జున్ సరసన కనిపించి ఆశ్చర్యపరిచింది అని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఓ సాంగ్ అంటే దానికి డాన్స్ మాస్టర్ తనకి అసిస్టెంట్ లాంటి వారు ఉంటారు. ఈ కిస్సిక్ సాంగ్ కి గణేష్ ఆచార్య కొరియోగ్రాఫ్ అందించారు. బహుశా తన అసిస్టెంట్ ఏమో కానీ ఆమె అల్లు అర్జున్ సరసన శ్రీలీల స్థానంలో ఉండి చేసిన స్టెప్పులు చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
ఈమె ఎవరో కానీ శ్రీలీలని కంప్లీట్ గా తినేసింది అంటూ ఆమె డామినేట్ చేసినట్టుగా పోస్టులు పెడుతున్నారు. మరి ఆ వీడియోలో చూస్తే అల్లు అర్జున్ పక్కన తన డాన్స్ మూమెంట్స్, గ్రేస్ చూస్తే నిజంగానే శ్రీలీలకి ఏమాత్రం తీసిపోనట్టే కనిపిస్తుంది. మొత్తానికి ఈమె ఎవరో కానీ శ్రీలీలనే మించి బన్నీ పక్కన అదరగొట్టింది అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇక లేటెస్ట్ గానే ఈ సాంగ్ ఫుల్ వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేసేసారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ వర్క్ చేయగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లు అందుకుని అదరగొడుతోంది. ఇక ఈ సినిమాకి పార్ట్ 3 కూడా ఉంది కానీ ఈ సినిమాని మేకర్స్ మరో రెండేళ్ల తర్వాత స్టార్ట్ చేయనున్నారని ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











