సక్సెస్ ఇవ్వకపోయినా మళ్ళీ అదే దర్శకుడితో రానా కొత్త మూవీ
బాహుబలి సినిమా తరువాత ఒక్కసారిగా నేషనల్ లెవెల్ యాక్టర్ గా ఎదిగిపోయిన రానా దగ్గుబాటి ఎలాంటి సినిమా చేసినా చాలా కొత్తగా ఉంటుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్నా కూడా స్టార్ ఇమెజ్ ని ఏ మాత్రం పట్టించుకోడు. మొన్నటివరకు హాథి మేరీ సాథి(అరణ్యం) సినిమాతో బిజీగా ఉన్న రానా మరికొన్ని డిఫరెంట్ ప్రాజెక్టులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.
దాదాపు విరాటపర్వం సినిమాను కూడా త్వరలోనే ఫినిష్ చేయనున్నాడు ఈ స్టార్ హీరో. ఇకపోతే రానా కెరీర్ లో ఎన్ని హిట్టు సినిమాలు ఉన్నా అందులో అందరికి ఎక్కువగా నచ్చే సినిమా ఏదైనా ఉందా అంటే.. అది 'లీడర్' అనే చెప్పాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రానా మొదటి సినిమా అదే. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. శేఖర్ కమ్ముల పెద్ద సక్సెస్ ఇస్తాడాని అనుకున్న రానా ఆశలు నిరాశాలయ్యాయి.

అయినప్పటికీ సినిమాకి ఇప్పుడున్న విలువను దృష్టిలో ఉంచుకొని ఎప్పుడైనా సరే మరొక సినిమా శేఖర్ కమ్ములతో చేస్తానని రానా చాలా ఇంటర్వ్యూలలో వివరించాడు. అయితే ఇప్పుడు ఆ సమయం రానే వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు నాగ చైతన్య ' లవ్ స్టోరీ' సినిమాను పూర్తి చేసిన శేఖర్ కమ్ముల ఆ సినిమా రిలీజ్ కాకముందే మరొక సినిమాని సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు. అందుకే రానాతో రీసెంట్ గా ఒక కథపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











