ధనుష్‌పై కేసు.. రష్మికను అవసరమైతే కేసులోకి గుంజుతాం: కుబేర టైటిల్ వివాదంలో ట్విస్ట్
కుబేర సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకొన్నది. శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ కుబేరా మాదే అంటూ నిర్మాతలు నరేందర్, మల్లేష్, రవికాంత్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము నిర్మాతల మండలిలో ముందుగా ఈ సినిమా టైటిల్ అంటే కుబేర రిజిస్టర్ చేసుకొన్నాం. కానీ ఆ టైటిల్‌ను శేఖర్ కమ్ముల తదితరులు వాడుకొంటున్నారు. ఈ క్రమంలో వారికి లీగల్ నోటీసులు కూడా ఇచ్చామన్నారు. ఆ వివాదం వివరాల్లోకి వెళితే..
నిర్మాత నరేంద్ర మాట్లాడుతూ.. త్రిశక్తి అనే బ్యానర్‌పై కుబేర అనే సినిమాను నిర్మించేందుకు సిద్దమయ్యాం. 2023 సంవత్సరంలో తెలుగు చలన చిత్ర మండలిలో టైటిల్‌ను 22 తేదీ నవంబర్ 2023 సంవత్సరంలో రిజిస్టర్ చేసుకొన్నాం. ఐదు భాషల్లో నిర్మించేందుకు మండలి అనుమతి కూడా ఇచ్చింది. ఆ తర్వాత షూటింగ్ స్టార్ చేశాం. ఆ తర్వాత మార్చి 8వ తేదీన 2024 రోజున శేఖర్ కమ్ముల కుబేర అనే టైటిల్‌ను రిలీజ్ చేయడంతో కంగుతిన్నాం అని అన్నారు.

శేఖర్ కమ్ముల కుబేర టైటిల్ బయటకు రావడంతో మేము తెలుగు చలన చిత్ర మండలిని అప్రోచ్ అయ్యాం. ముందుగా మేము టైటిల్ రిజిస్టర్ చేసుకొన్నాం. వాళ్లకు మళ్లీ అదే టైటిల్‌ను ఎలా రిజిస్టర్ చేసుకొంటారని అడిగాం. అయితే మండలిలో నిర్మాత ప్రసన్న కుమార్ మా గోడు వినకపోగా.. మమ్మల్ని బెదిరించేందుకు ప్రయత్నించారు. పెద్ద వాళ్లతో పెట్టుకోవద్దు. మీది చిన్న సినిమా.. వాళ్లది పెద్ద సినిమా అంటూ దుర్భాషలాడారు. మీరు కొత్త వాళ్లతో సినిమా తీస్తూ పెద్ద వాళ్లతో ఎలా పెట్టుకొంటారు. మీ సినిమా పరిస్థితి ఏమౌతుందో తెలుసుకోండి అని బెదిరించడంతో మేము లీగల్‌గా పోరాటం చేయాలని ప్లాన్ చేశాం అని అన్నారు.
మేము శేఖర్ కమ్ముల టీమ్‌తో కూడా చర్చించాం. అయితే మాకు న్యాయం చేస్తారని అన్నారు. కానీ వారు మాతో సంప్రదించకుండానే రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. శేఖర్ కమ్ముల కుబేర టైటిల్‌లో శేఖర్ కమ్ముల పేరు చిన్నగా కనిపించకుండా.. కుబేర పేరును పెద్దగా ప్రింట్ చేశారు. అలా చేయడం చట్టపరంగా విరుద్ధం. మా సినిమాకు ఇబ్బంది కలిగేలా ఉంది అని నరేంద్ర తెలిపారు. ఎన్నో ఆశలు పెట్టుకొని కుబేర సినిమాను ప్రారంభించాం. ఇప్పుడు శేఖర్ కమ్ముల మా టైటిల్ తీసుకోవడం బాధగా ఉంది అని మల్లేశ్, రవికాంత్ అన్నారు.

టాప్ హీరో నాగార్జున అక్కినేని, తమిళ స్టార్ ధనుష్, రష్మిక మందన్న నటిస్తున్న సినిమాకు శేఖర్ కమ్ముల మా టైటిల్‌ను పెట్టుకొన్నారు. శేఖర్ కమ్ముల కుబేర అనే టైటిల్‌ను రిలీజ్ చేశారు. శేఖర్ కమ్ముల పేరు కనిపించకుండా.. కుబేరను కనిపించేలా ముద్రించారు. ఈ వివాదంపై తెలుగు చలనచిత్ర మండలి, సెక్రటరి ప్రసన్న కుమార్, శేకర్ కమ్ముల, అమిగోస్ క్రియేషన్ బ్యానర్, హీరో ధనుష్‌పై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. హీరోయిన్ రష్మిక మందన్న కేసులో ఇరికించలేదు. లేడీస్ కావడంతో ఆమెను వదిలేశాం. ఇదే వివాదాన్ని కొనసాగిస్తే.. ఆమె పేరు కూడా కేసులో చేర్చుతాం అని న్యాయవాది అన్నారు.


Click it and Unblock the Notifications











