twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుణే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూబ్ చైర్మన్‌గా శేఖర్ కపూర్.. భారత ప్రభుత్వం ప్రకటన

    |

    ప్రముఖ దర్శకుడు, నటుడు శేఖర్ కపూర్‌కు అరుదైన గౌరవం లభించింది. పుణే‌లోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) సొసైటీ చైర్మన్‌గా, ఎఫ్‌టీఐఐ ఇనిస్టిట్యూట్స్ గవర్నర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియమిస్తూ భారత ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. శేఖర్ కపూర్ నియామకంపై బాలీవుడ్ నటి కంగన రనౌత్, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. శేఖర్ కపూర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

    దర్శకుడు శేఖర్ కపూర్ నియామకంపై కేంద్ర సమచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఎఫ్‌టీఐఐ చైర్మన్‌గా శేఖర్ కపూర్‌ను నియమించామనే విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. సినీ రంగంలో విశేష అనుభవం ఉన్న శేఖర్ కపూర్‌ను ఈ పదవుల్లో నియమించడం గర్వంగా ఉంది. ప్రతిష్టాత్మకమైన సంస్థ గౌరవాన్ని మరింత పెంచుతారనే నమ్మకం నాకు ఉంది. ఆయన నియామకాన్ని ప్రతీ ఒక్కరు స్వాగతించాలి అని జవదేకర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    శేఖర్ కపూర్‌ను ఎఫ్‌టీఐఐ సొసైటీ అధ్యక్షుడిగా, ఎఫ్‌టీఐణ గవర్నర్ కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో మార్చి3, 2023 వరకు కొనసాగుతారు అని తన ట్వీట్‌లో ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

    Shekhar Kapur appointed president of the Film and Television Institute of India (FTII)

    గతంలో ఈ పదవిలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కొనసాగారు. 2018లో రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానంలో సీఐడీ సీరియల్ నిర్మాత దర్శకుడు బీపీ సింగ్‌ను నియమించడం తెలిసిందే.

    1983లో మాసూమ్ చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా శేఖర్ కపూర్ బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత మిస్టర్ ఇండియా (1987), బండిట్ క్వీన్ (1994), ఎలిజబెత్ (1998), ది ఫోర్ ఫీదర్స్ (2002), ఎలిజబెత్: ది గొల్డెన్ ఏజ్ (2007), న్యూయార్క్, ఐ లవ్ యూ (2008), పాసేజ్ (2009) చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1974లో ఇష్క్ ఇష్క్ ఇష్క చిత్రంతో నటుడిగా మారారు. ఉడాన్, విశ్వరూపం, విశ్వరూపం2 చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా పలు ఉత్పత్తులకు మోడల్‌గా రాణించారు.

    English summary
    Bollywood's Shekhar Kapur appointed president of the Film and Television Institute of India (FTII). Information and Broadcasting Minister Prakash Javadekar tweeted, The Government of India nominates Shri Shekhar Kapur as President if FTII Society and Chairman of Governing Council of FTII till March 3, 2023.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X