నా భుజాలపై పడి ఏడ్చినప్పుడే పరిస్థితి అర్ధమైంది.. శేఖర్ కపూర్ ఎమోషనల్ ట్వీట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు తమ దిగ్బ్రాంతిని వ్యక్తం చూస్తూ సంతాప సందేశాలతో శ్రద్దాంజలి ఘటించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ ట్వీట్‌తో ఎమోషనల్ అయ్యారు.

సుశాంత్ మృతి నేపథ్యంలో ట్వీట్ చేస్తూ.. నీవు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నావో నాకు తెలుసు. నిన్ను మానసికంగా వేధిస్తూ నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నారని చెబుతూ నా భుజాలపై ఏడ్చినప్పుడే నాకు పరిస్థితి అర్ధమైంది. నీకు మానసికంగా దగ్గరయ్యేందుకు 6 నెలలుగా ప్రయత్నించాను. నీవు నా మాటలను అర్ధం చేసుకొన్నావని అనుకొన్నాను. నీకు జరిగిన అన్యాయం వారి ఖర్మ. నీకు కాదు అని ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Shekhar Kapur emotional tweet on Sushanth Singh Rajput death

సుశాంత్ మరణానికి కొందరు బాలీవుడ్ ప్రముఖులే కారణమంటూ పలువురు బహిరంగంగా విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారు. అనుభవ్ సిన్హా, కేఆర్కే, కంగన రనౌత్ లాంటి ప్రముఖులు సినీ పెద్దల తీరును ఎండగడుతున్నారు.

డిప్రెషన్ గురైన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ముంబైలోని బాంద్రాలోని నివాసంలో ఉరివేసుకొని మరణించడం సినీ పరిశ్రమను కుదిపేసింది. రెండు గంటపాటు నిర్వహించిన పోస్టు మార్టమ్ అనంతరం ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు పూర్తి చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X