twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోల శకం ముగిసినట్టే.. సూపర్‌స్టార్ల హవా కనిపించదేమో! వర్మ, శేఖర్ కపూర్ ట్వీట్స్

    |

    కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా హాళ్లు మూతపడటంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ స్తంభించింది. థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో పలు సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ మంగళవారం ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

    శేఖర్ కపూర్ తన ట్వీట్‌ ద్వారా స్పందిస్తూ.. కనీసం ఓ ఏడాదిపాటు థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తొలివారంలో రూ.100 కోట్ల హైప్‌కు ఇక కాలం చెల్లినట్టే. ఇక స్టార్ల హవా థియేటర్లలో తగ్గుముఖం పట్టడం, కనిపించకపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఎంత పెద్ద స్టార్ హీరోనైనా ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఆశ్రయించాల్సిందే. లేదా సొంతంగా యాప్‌లను తయారు చేసుకొని రిలీజ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు అలాంటి యాప్స్ తయారు చేసుకోవడం చాలా సింపుల అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

     Shekhar Kapur, Ram Gopal Varma have made sensational comments on ott

    గత కొద్దిరోజులుగా శేఖర్ చెప్పిన విషయాలనే దర్శకుడు రాంగోపాల్ వర్మ చెబుతున్నారు. ఓటీటీలదే ఇక భవిష్యత్తు. స్టార్ స్టేటస్, సూపర్ స్టార్లకు కాలం చెల్లినట్టే. ఇంట్లో సినిమా చూస్తే తెరపైన హీరోలు కనిపిస్తే ఈలలు వేసి,... కాగితాలు చల్లే కాలానికి స్వస్తి చెప్పాల్సిందే. ఇంట్లో అలాంటి పనులు చేస్తే పిచ్చోళ్ల మాదిరిగా చూస్తారు. ఎవరైనా ఈ పరిస్థితుల్లో ఓటీటీలను ఆశ్రయించాల్సిందే అని వర్మ చెబుతూ వస్తున్నారు.

    ఈ క్రమంలో శేఖర్ కపూర్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ.. వినడానికి ఈ కామెంట్ చాలా సొంపుగా ఉంది. భవిష్యత్‌ను ఊహించడంలో ఇంతకు మించి మంచి రోజు ఉండదేమో అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

    English summary
    Shekhar Kapur, Ram Gopal Varma have made sensational comments on Stardom and OTT future. Shekhar tweeted that, Theatres are not going to open for atleast a year. So all hype around first weeks bussiness of 100+ crores is dead. So the theatrical Star System is dead. Stars will have to go to existing OTT platform or stream films themselves through their own apps. Technology is quite simple.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X