స్టార్ హీరోయిన్‌తో రొమాన్స్.. కట్ చేస్తే ఆమెకే డ్రైవర్‌గా, తలక్రిందులైన హీరో జీవితం
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవుతాయని అంటుంటారు. ఇక రంగుల ప్రపంచం లాంటి సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ చూసినవారు చివరికి అడ్రస్ లేకుండా పోయిన వారెందరో. విలాసాలకు అలవాటు పడి వచ్చిన డబ్బును వచ్చినట్లు ఖర్చు చేసి చివరికి చిల్లిగవ్వ లేకుండా జీవితాన్ని ముగించిన నటీనటులు ఎందరో. ఇక వరుస ఫెయిల్యూర్స్‌తో అవకాశాలు రాక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న నటీనటులు మరికొందరు. భారతీయ చిత్ర పరిశ్రమలో అడుగడుగునా ఇలాంటి వారు కనిపిస్తారు. ఏ హీరోయిన్ పక్కన హీరోగా నటించాడో ఆమెకే కారు డ్రైవర్‌గా చేస్తే .. ఆ వ్యక్తి ఎంతటి నరకయాతన అనుభవించి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో జరిగే ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో జరిగితే. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్.
తొలి చిత్రానికే రేఖతో రొమాన్స్
బీహార్‌లో పుట్టి పెరిగిన శేఖర్ సుమన్ 1984లో గిరీష్ కర్నాడ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉత్సవ్ సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. ఇందులో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ రేఖ హీరోయిన్ కావడం విశేషం. తొలి సినిమాకే రేఖ వంటి దిగ్గజ నటితో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. అందులో ఆమెతో బెడ్ రూమ్ సీన్స్‌లోనూ రెచ్చిపోయి నటించాడు సుమన్. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత రెఘుజార్, మానవ్ హత్య, నాచే మయూరి, అనుభవ్, యాట్నా, సన్సార్ తదితర చిత్రాల్లో నటించారు సుమన్. కానీ వీటిలో ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో ఆయనపై ఫ్లాప్ స్టార్ ముద్రపడింది. అప్పటి బాలీవుడ్ అందాల భామలు మాధురి దీక్షిత్, పద్మిని కొల్హాపురి, డింపుల్ కపాడియాలతో సినిమాలు చేసినా వారి అదృష్టం కూడా సుమన్‌ని కాపాడలేకపోయింది.

బుల్లితెరపై సక్సెస్ కొట్టిన శేఖర్
సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపై అడుగుపెట్టారు శేఖర్ సుమన్. ఇక్కడ మాత్రం ఆయన సక్సెస్ కొట్టారు. శేఖర్ నటించిన ప్రతి సీరియల్‌కు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కడంతో బుల్లితెరపై సూపర్‌స్టార్‌గా వెలుగొందారు. 1962లో అల్కా సుమన్‌ను పెళ్లాడగా.. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఆయుష్ 11 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించడం శేఖర్ సుమన్‌ను మరింత కృంగదీసింది. సినిమాలు ఫ్లాప్ కావడం, కుమారుడి మరణంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారు. అయితే తిరిగి కోలుకుని బుల్లితెరపై వరుస అవకాశాలు అందుకున్నారు.
హీరామండీతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్
2024లో క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన హీరామండీతో శేఖర్ సుమన్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇందులో జుల్ఫీకర్‌గా ఆయన తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన శేఖర్ సుమన్ 2009 లోక్‌సభ ఎన్నికల్లో పట్నా సాహిబ్ నుంచి పోటీ చేశారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు, బీజేపీ అభ్యర్థి శత్రుఘ సిన్హా ఆయన ప్రత్యర్ధి కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లో సిన్హా చేతుల్లో శేఖర్ ఓటమి పాలయ్యారు. దీంతో కొన్నేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న శేఖర్ గతేడాది బీజేపీలో చేరారు.
మాధురీ దీక్షిత్‌కు డ్రైవర్‌గా
కాగా.. ఉత్సవ్ సినిమాకు ముందే మానవ్ హత్య అనే చిత్రంలో మాధురి దీక్షిత్‌తో కలిసి నటించారు శేఖర్ సుమన్. కానీ ఉత్సవ్ చిత్రం ముందు రిలీజైంది. నాడు చిన్న నిర్మాతలు, లో బడ్జెట్ చిత్రం కావడం, కొత్త నటీనటులు కావడంతో మానవ్ హత్యలో నటిస్తున్న వారికి నిర్మాతలు రవాణా సదుపాయం కల్పించలేదు. దీంతో సుమన్ స్వయంగా.. మాధురీ దీక్షిత్‌ను తన బైక్‌పై ఇంటి నుంచి షూటింగ్ స్పాట్‌కు జాగ్రత్తగా తీసుకెళ్లి, తీసుకొచ్చేవాడు.
ఈ సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడే శేఖర్ సుమన్‌కు రేఖతో కలిసి ఉత్సవ్ చిత్రంలో నటించే అవకాశం దక్కడంతో యూనిట్ ఆశ్చర్యపోయిందట. కానీ దురదృష్టవశాత్తూ ఫ్లాప్ స్టార్ ముద్ర వేసుకున్న శేఖర్ ఎన్నో కష్టాలు పడి చివరికి బుల్లితెరపై సక్సెస్ అయ్యాడు. ఎవరినైతే రోజు షూటింగ్‌కి తీసుకెళ్లేవాడో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఇండియాను ఊపేసే సూపర్‌స్టార్‌గా ఎదిగింది. సో.. జీవితం కొట్టే దెబ్బ అలా ఉంటది మరి.


Click it and Unblock the Notifications











