For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నడిరోడ్డుపైనే శిల్పాశెట్టి లిప్‌లాక్‌.. ముద్దుల హోరులో తడిసిందేవరంటే!

|

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తాజాగా భర్త రాజ్ కుంద్రాను ముద్దు పెట్టుకొంటున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ప్రస్తుతం లండన్‌లో విహరిస్తున్న ఆమె భర్తతో రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. శిల్పాశెట్టి దంపతులతోపాటు సోదరి షమితాశెట్టి, కుమారుడు వియాన్ కుంద్రా లండన్‌ వీధుల్లో హల్‌చల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా లండన్ వీధుల్లో రాజ్ కుంద్రాను ముద్దు పెట్టుకొంటున్న వీడియోను షేర్ చేశారు.

లండన్ స్ట్రీట్‌లో ముద్దు పెట్టుకొంటూ ఇది జుమ్మా చుమ్మా (శుక్రవారం ముద్దు) అంటూ కామెంట్ చేశారు. అమితాబ్ బచ్చన్ పాపులర్ సాంగ్‌ను హమ్మింగ్ చేస్తూ ఫైడే ఫన్ అంటూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశారు. 2009లో పెళ్లిన ఈ దంపతులు ఇప్పటికీ నవ దంపతులకు తీసి పోని విధంగా రొమాన్స్ చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది.

Shilpa Shetty liplock in London streets goes viral

తొలుత రాజ్ కుంద్రాను రెండో వివాహం చేసుకోవడానికి తటపటాయించింది. చివరికి పెద్దల అంగీకారంతో 2009 నవంబర్ 22న పెళ్లికి సిద్ధమయ్యారు. అప్పట్లో ఈ పెళ్లికి అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం వీరిద్దరికి ఏడేళ్ల వియాన్ కుంద్రా అనే కుమారుడు ఉన్నారు.

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన శిల్బాశెట్టి ప్రస్తుతం టెలివిజన్ రంగంలో కూడా రాణిస్తున్నారు. టెలివిజన్ రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా పారిశ్రామిక వేత్తగా, క్రికెట్ జట్టు ఓనర్‌గా పలు పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Shilpa Shetty liplock with Raj Kundra in London streets goes viral. Shilpa Shetty Kundra, her sister Shamita Shetty, husband Raj Kundra and their son Viaan Kundra are on a holiday in London. Shilpa has been sharing some absolutely adorable videos from the vacation, including romantic moments with her husband Raj Kundra.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more