షిన్ చాన్: ది స్పైసీ కసుకాబే డ్యాన్సర్స్ ఇన్ ఇండియా గ్రాండ్ రిలీజ్.. యానిమేటెడ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
యానిమేషన్ సినిమాలను ఇష్టపడే భారతీయ ప్రేక్షకులకు పండుగలాంటి వార్త. ఎంతో కాలంగా యానిమేషన్ చిత్రాల ప్రేమికులు ఎదురు చూస్తున్న షిన్ చాన్: ది స్పైసీ కసుకాబే డ్యాన్సర్ చిత్రం ఇండియాలో థియేటర్లలో ప్రదర్శించబడుతున్నది. ఈ చిత్ర కథ షిన్ చాన్, హగాషిమిర్‌లోని కాసుకాబే కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్‌లో పాల్గొన్న నలుగురు కాసుకాబే గార్డుల చుట్టూ తిరుగుతుంది. కాసుకాబే సిటీ, ముషిబాయ్ నగరాల్లోని ఫెస్టివల్ సెలబ్రేషన్ జరుగుతాయి. ఈ సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఇండియాలో పర్యటించి.. అక్కడ జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. షిన్ చాన్‌పాటు కాసుకాబే గార్డ్ టీమ్‌కు చెందిన నలుగురు విజేతలుగా నిలిచి.. ఇండియాకు వస్తారు. వారి ప్రయాణంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలే ఈ సినిమాకు భారీ ట్విస్టుగా మారుతాయి. ఈ చిత్రానికి మసాకజు హషిమోటో దర్శకత్వం వహించారు.
షిన్ చాన్, కాసకబే గార్డ్ గ్రూపులోని మిస్టీరియస్ క్యారెక్టర్, లీడ్ స్టార్ బో చాన్ మధ్య స్నేహబంధం గురించి చెప్పే ఫీల్ గుడ్ కథ. ఇండియాలో సాహోసోపేతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న షిన్ చాన్, బో చాన్‌కు ఓ అసాధారణమైన జనరల్ స్టోర్ వద్ద అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. ఆ స్టోర్ లోపల వారికి ముక్కు రూపంలో వింతైన బ్యాక్ ప్యాక్ లభిస్తుంది. వింత ఆకారంలో కనిపించిన దానిని షిన్ చాన్ కొనుగోలు చేయాలని నిర్ణయిస్తాడు. ఆ సమయంలో దాని ద్వారా ఎదురయ్యే కనిపించని ప్రమాదాన్ని గుర్తించలేకపోతాడు. బ్యాక్ ప్యాక్‌లో ఉన్న కాగితం ముక్క ముక్కులోకి దూరి బో చాన్ ఉత్సాహంపై నీళ్లు జల్లుతుంది. అతడి అమాయకపు చర్య వల్ల ఓ దుష్టశక్తి అతడిని ఆవహించేస్తుంది. ఆ దుష్ట ప్రభావంతో బ్రో చాన్ ప్రపంచాన్ని బెదిరించే శక్తులు వచ్చిన ఓ భయంకరమైన నియంతగా మారిపోతాడు. ఆ సమస్య నుంచి షిన్ చాన్, అతడి స్నేహితులు ఎలా రక్షించారనేది ఆసక్తికరమైన పాయింట్ ఈ సినిమాగా రూపొందింది.

ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ప్రతీ ఒక్కరిని ఎక్సైట్ చేసింది. తొలిసారి షిన్ చాన్ యూనివర్స్‌లో బారతీయత, ఇక్కడ సంస్కృతి ప్రధానమైన భాగంగా కనిపిస్తుంది. పిల్లలను మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఆస్వాదించే విధంగా, లీనమయ్యే విధంగా డైనమిక్ యానిమేషన్‌తో ఎపిక్ స్కేల్‌లో రూపొందించబడింది.

షిన్ చాన్: ది స్పైసీ కసుకబే డ్యాన్సర్స్ ఇన్ ఇండియా సినిమా గురించి దర్శకుడు మసకజు హషిమోటో మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాణ సమయంలో లోకేషన్ల ఎంపిక కోసం స్క్రిప్టుతోపాటు నా స్టాఫ్‌తో భారత్‌లో పర్యటించాను. ఆ సమయంలో స్పైసీ కర్రీ ఆరగించడమే కాకుండా తీవ్రమైన వేసవి తాపాన్ని చూశాం. ఈ సందర్బంగా పాటలు, డ్యాన్సులు, వినోదం, నవ్వులు, ఆనందభాష్పాలు, ఫుడ్ ఎన్నో భావోద్వేగాలను మా మనసులో నిలిచిపోయాయి. షిన్ ఛాన్ స్పూర్తికి వాస్తవికతను జోడించాయి.

ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మీకు ముఖ్యంగా మనవి చేసేదేమిటంటే.. షిన్ చాన్: ది స్పైసీ కసుకాబే డ్యాన్సర్స్ ఇన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా థియేటర్లలో ప్రదర్శిస్తున్నాం. ఈ సినిమా టికెట్లను కొనుగోలు చేసుకొని.. షిన్ చాన్‌ను ఆస్వాదించండి.
ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్ చేసుకోవడానికి.. bookmy.show/ShinchanTSKDI క్లిక్ చేయండి.
Copyright: ©USUI YOSHITO/FUTABASHA,SHIN-EI,TV ASAHI,ADK 2025


Click it and Unblock the Notifications











