Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘టక్ జగదీష్’ రిలీజ్‌పై చిత్ర యూనిట్ క్లారిటీ: బాక్సాఫీస్‌ను టక్ చేస్తామంటూ ప్రకటన
టాలీవుడ్ టాలెంటెండ్ హీరో నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం 'టక్ జగదీష్'. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించాడు. అప్పుడెప్పుడో మొదలైన ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేశారు. సినిమాను విడుదల చేద్దామనుకున్న టైమ్‌లోనే కరోనా ప్రభావం పెరగడంతో అది వీలు పడలేదు. ఇక, ఇప్పుడు ఆ మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతుండడంతో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ గురించి నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.
'టక్ జగదీష్' సినిమాను పలానా రోజున విడుదల చేయబోతున్నారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ ఈ మూవీ రిలీజ్‌పై స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్లో 'టక్ జగదీష్ విడుదల గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాము. ఎటువంటి ప్రచారాలను నమ్మకండి. మాతో కనెక్ట్ అయి ఉండండి. త్వరలోనే బాక్సాఫీస్‌ను టక్ చేయబోతున్నాం' అని పోస్ట్ చేసింది. అంటే.. ఇప్పటి వరకూ వచ్చినవన్నీ రూమర్లే అని తేలికగా కొట్టి పారేసింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన 'టక్ జగదీష్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో అన్ని ఏరియాల రైట్స్ అత్యధిక ధరకు అమ్ముడు పోయాయి. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. నరేష్, జగపతిబాబు, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.